NABARD Recruitment 2026:
జాతీయ గ్రామీణ వ్యవసాయ బ్యాంకు అయిన (NABARD) లో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయుటకు 17 జనవరి 2026 నుండి 3 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఉంది ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయుటకు అవకాశం ఇచ్చారు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NABARD ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ GDS 28 వేల ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) వారు విడుదల చేశారు ఇందులో డెవలప్మెంట్ అసిస్టెంట్ 162 ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 17 జనవరి 2026 నుండి 3 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం రావడం జరిగింది. ప్రిలిమ్స్ పరీక్ష 21 ఫిబ్రవరి 2026 నిర్వహిస్తారు మెయిన్స్ పరీక్ష 12 ఏప్రిల్ 2026 న ఉంటుంది.
విద్యా అర్హత:
ఇందులో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ 50% ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులకు డిగ్రీ హిందీ మరియు ఇంగ్లీష్ అర్హతతో పూర్తిచేసి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 550 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ ఉంటుంది వంద మార్కులకు పరీక్ష ఒక గంట సమయం ఉంటుంది ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి మూడు ఫిబ్రవరి 206 లోపు ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి NABARD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “NABARD Recruitment 2026: గ్రామీణ బ్యాంకు NABARD లో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ ”