Free Cylinder Update:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం లబ్ధిదారులకు శుభవార్త గుడ్ న్యూస్ రావడం జరిగింది ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకం లో భాగంగా దీపం పథకం అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకనుండి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత ముందుగా వారికి డబ్బులు చెల్లించి ఆ తర్వాత గ్యాస్ డెలివరీ చేయాలని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. దీనికి వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రం మొత్తం దీనిని అమలు చేయనున్నారు.
ఇటువంటి Free Cylinder పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో కొత్త ఉద్యోగాలు భర్తీకి అంత సిద్ధం
ముందుగా డబ్బులు జమ చేస్తారు:
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో దీపం పథకం అమలులో భాగంగా లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీ వారికి డబ్బులు చెల్లించిన తర్వాత ప్రభుత్వం వారికి జమ చేస్తూ వస్తోంది ఇక నుండి ముందుగా అంటే లబ్ధిదారులు గ్యాస్ బుకింగ్ చేసిన వెంటనే వారికి డబ్బులు జమ చేసి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే విధంగా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. మీ పైలెట్ సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పైలెట్ ప్రాజెక్టు పూర్తి వివరాలు:
ప్రభుత్వం దీపం పథకం సంబంధించి గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది ఇది విజయవంతం అయితే రాష్ట్రం మొత్తం దీనిని అమలు చేయాలని ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్యాస్ ఏజెన్సీల సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.
ఇటువంటి Free Cylinder సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.