TSRTC Recruitment 2025:
తెలంగాణ ఆర్టీసీ డిపోలో పనిచేయడానికి డ్రైవర్ మరియు వివిధ శ్రామిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మొత్తం 1741 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో 1000 డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి మిగిలినవి ఫిట్టర్, మెకానిక్ మొదలైన ఖాళీలు భర్తీ చేస్తున్నారు అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది.
ఇటువంటి TSRTC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 8 అక్టోబర్ 2025 నుండి 28 అక్టోబర్ 2025 వరకు అవకాశం కల్పించారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ TSRTC లో ఖాళీలు భర్తీ చేయుటకు తెలంగాణ పోలీస్ శాఖ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 1000 డ్రైవర్ ఉద్యోగాలు మిగిలిన శ్రామిక్ పోస్టులు ఉన్నాయి మొత్తంగా 1741 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత:
డ్రైవర్ పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు మెకానిక్, ఫిట్టర్ మొదలైన ఉద్యోగాలకు పదవ తరగతి తర్వాత ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే డ్రైవర్ ఉద్యోగానికి బేసిక్ పే 20,960/- నుండి ప్రారంభం అవుతుంది శ్రామిక్ పోస్టులకు 16,550/- నుండి ప్రారంభం అవుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబంధించి అవసరం అయితే పరీక్ష నిర్వహిస్తారు తప్పనిసరిగా స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.
ఇటువంటి TSRTC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “RTC లో 1741 పోస్టులు భర్తీ | TSRTC Recruitment 2025 | TSRTC Notification 2025”