AP DCPU Jobs 2025:
ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంబంధించి జిల్లా బాలల రక్షణ విభాగం (DCPU) ఆధ్వర్యంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో మల్టీ పర్పస్ స్టాప్, కుక్, హౌస్ కీపర్, అనలిస్ట్, కోఆర్డినేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DCPU ఉద్యోగ సమాచారం గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 19 నవంబర్ 2025 నుండి 29 నవంబర్ 2025 వరకు ఆఫ్లైన్ లో దరఖాస్తు సమర్పించడానికి అవకాశం కల్పించడం జరిగింది కావున అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జిల్లా బాలల రక్షణ విభాగం (DCPU) వారు విడుదల చేశారు ఇందులో వివిధ మల్టీ పర్పస్ స్టాప్, కుక్, హౌస్ కీపర్, అనలిస్ట్, కోఆర్డినేటర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం కల్పిస్తున్నారు.
వయస్సు వివరాలు:
దరఖాస్తు చేయడానికి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత సమాచారం:
- పోస్టులు అనుసరించి సామాజిక కార్యకర్త ఖాళీలకు దరఖాస్తు చేయాలంటే సోషల్ వర్క్ లేదా సోషియాలజీ సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- డేటా అనలిస్ట్ ఖాళీలకు గణితం లేదా ఆర్థిక శాస్త్రం కంప్యూటర్ కోర్సు సంబంధించిన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- హౌస్ కీపర్ పోస్టులకు పదవ తరగతి ముదిరిన సాధించి మూడు సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
- ఎడ్యుకేటర్ పోస్టులకు గణితం లేదా సైన్స్ విభాగంలో BSC పూర్తిచేసి B.Ed అర్హత ఉన్నవారు అర్హులు.
- మేనేజర్ పోస్టులకు సైకాలజీ కోర్సు డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు.
- ఆయా ఉద్యోగాలకు ఎటువంటి విద్య అర్హత అవసరం లేదు.
- మల్టీ పర్పస్ స్టాప్ పోస్టులకు 10వ తరగతి అర్హత ఉంటే చాలు.
🔥వాతావరణ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి ఈ ఉద్యోగాలకు 10,000/- నుండి 23,170/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ లభించవు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింది ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు 29 నవంబర్ 2025 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ ఫారం జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు సమర్పించండి.
ఇటువంటి AP DCPU ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP DCPU Jobs 2025: ఆంధ్రప్రదేశ్ జిల్లా బాలల రక్షణ విభాగం నుండి ఉద్యోగాలు విడుదల ”