IIITK Jobs: 10+2 అర్హత తో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | IIITK Non Teaching Jobs 2025

IIITK Non Teaching Jobs 2025:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం (IIITK) లో చాలా మంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది నాన్ టీచింగ్ సంబంధించి జూనియర్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్, జూనియర్ టెక్నీషియన్, MTS పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లో 22 డిసెంబర్ 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు ఎలా దరఖాస్తు చేయాలి అనే వివరాలు క్రింద వివరించడం జరిగింది పూర్తి వివరాలు చూసి అవగాహన వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIITK (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం) సంస్థ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ సంస్థలో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కావున అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి.

🔥ఏపీ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 21 నవంబర్ 2025 నుండి 22 డిసెంబర్ 25 వరకు ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది కావున అర్హత ఉన్న అభ్యర్థులు https://recruitstaff.iiitkottayam.ac.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయండి.

విద్యా అర్హత:

ఇందులో భర్తీ చేసే పోస్టులు అనుసరించి విద్యా అర్హత క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.

  • డిప్యూటీ రిజిస్టార్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
  • జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ సివిల్ తో పాటు రెండు సంవత్సరాలు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
  • జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్ ఖాళీలకు దరఖాస్తు చేయాలంటే మేనేజ్మెంట్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ లేదా కంప్యూటర్ డిగ్రీ ఉన్నవారు అర్హులు.
  • జూనియర్ టెక్నీషియన్ ప్రోగ్రామింగ్ పోస్టులకు బీటెక్ లేదా MCA లేదా M.SC పూర్తి చేసి సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాలు అనుభవం ఉండాలి.
  • జూనియర్ టెక్నీషియన్ నెట్వర్కింగ్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
  • MTS ఖాళీలకు దరఖాస్తు చేయాలంటే 10+2 తర్వాత ఉండాలి పూర్తి విద్య అర్హతల కోసం నోటిఫికేషన్ సమాచారం గమనించగలరు.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 45,000/- వరకు రావడం జరుగుతుంది.

ఎంపిక విధానం: 

మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి పోస్టులు అనుసరించి 250/- నుండి 1000/- వరకు ఫీజు ఉంది. మహిళలు, దివ్యాంగులు మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

IIITK Non Teaching Jobs 2025

దరఖాస్తు విధానం:

పైన తెలిపిన విధంగా మీకు అర్హతలు ఉంటే అర్హత కలిగిన అభ్యర్థులు 22 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి IIITK ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి

మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “IIITK Jobs: 10+2 అర్హత తో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | IIITK Non Teaching Jobs 2025”

Leave a Comment

error: Content is protected !!