AP District Court Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పని చేయుటకు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ఆఫీస్ సబార్డినేట్ మరియు టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం పదవ తరగతి మరియు డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేయవచ్చు సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం దరఖాస్తు చేయుటకు 17 ఫిబ్రవరి 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP District Court ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥గ్రామ పాలన అధికారి ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 17 ఫిబ్రవరి 2026 చివరి తేదీ కావున అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా AP District Court అయిన కృష్ణాజిల్లా నుండి విడుదల కావడం జరిగింది ఇందులో ఆఫీస్ సబార్డినేట్ మరియు టైపిస్ట్ కం అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి మొత్తం ఆరు పోస్టులు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ లో ఉద్యోగం చేయాలి.
విద్యా అర్హత:
ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఏడవ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు టైపిస్టు ఉద్యోగానికి డిగ్రీ అర్హత ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి 15000 జీతం ఇస్తారు టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగానికి జీతం 18,500/- చెల్లిస్తారు ఎటువంటి ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఉన్నవారికి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ఎటువంటి ఫీజు లేకుండా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్ లో తెలిపిన పత్రాలు అన్ని జత చేసి జిల్లా లీగల్ సెల్ అథారిటీ, కృష్ణ జిల్లా వారికి 17 ఫిబ్రవరి 2026 లోపు సమర్పించాలి.
ఇటువంటి AP District Court ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP District Court Jobs 2026: ఏపి జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ ఉద్యోగాలు భర్తీ”