AP DMHO Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మరియు సూపర్వైజర్ పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ చూసి అప్లికేషన్ ఫారం 26 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DMHO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥RBI లో 650 అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 18 ఫిబ్రవరి 2026 నుండి 25 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను విశాఖపట్నం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వారు (DMHO) విడుదల చేశారు ఇందులో వివిధ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మరియు సూపర్వైజర్ 20 ఖాళీలు సొంత జిల్లాలో పని చేయుటకు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఫార్మసిస్ట్ పోస్టుకు మీరు దరఖాస్తు చేయాలంటే బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలకు DMLT లేదా BSC MLT అర్హత ఉంటే చాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఖాళీలకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
అన్ని పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు, వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, BC మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు OC/BC వారు 200 రూపాయలు ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు 100 రూపాయలు DD జిల్లా వైద్యశాఖ అధికారి విశాఖపట్నం పేరు పైన తీసి అప్లికేషన్ ఫారం తో పాటు సమర్పించాలి.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అప్లికేషన్ ఫారం 25 ఫిబ్రవరి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించండి.
ఇటువంటి AP DMHO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
