AP Police Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త.. AP State Police Recruitment Board (APSLPRB) వారు ఆరు నోటిఫికేషన్ల ద్వారా 2050 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో 378 ఎస్ఐ పోస్టులు, 1156 కానిస్టేబుల్ జాబ్స్, 200 కమ్యూనికేషన్ కానిస్టేబుల్, 198 డ్రైవర్ కానిస్టేబుల్, 15 మెకానికల్ పోస్టులు మరియు ఇతర ఖాళీలు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు, ఎంపిక విధానం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
ఇటువంటి AP Police ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.
🔥AP లో భారీగా EO ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు చేయడానికి పరీక్ష తేదీలు త్వరలో అధికారిక వెబ్సైట్ ద్వారా ఇస్తాం అని నోటిఫికేషన్ లో తెలియ చేశారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా AP Police రిక్రూట్మెంట్ బోర్డ్ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 2050 పోలీస్ కానిస్టేబుల్ మరియు SI పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి ఇంటర్, డిప్లమా, ITI, డిగ్రీ మరియు బీటెక్ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్యా అర్హత ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
పోస్టులు అనుసరించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం:
1.ప్రిలిమినరీ రాత పరీక్ష (Preliminary Written Test)
2.దేహదారుఢ్య పరీక్షలు (PET / PMT)
3.మెయిన్స్ రాత పరీక్ష (Final Written Exam)
4.సర్టిఫికేట్ వెరిఫికేషన్
Note: కొన్ని పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష ఉండదు అది పోస్టుల వారీగా మీరు పరిశీలించి దరఖాస్తు చేయండి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 300 రూపాయలు ఫీజు చెల్లించాలి ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు.

దరఖాస్తు విధానం:
అన్ని నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పరిశీలించి త్వరలో ఇచ్చే దరఖాస్తు తేదీ నుండి దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది అన్ని నోటిఫికేషన్ వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP Police ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
