IIT Tirupati Junior Executive Assistant Recruitment 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త! ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో Junior Executive Assistant ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు ₹25,000 నుంచి ₹30,000 వరకు జీతం చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇటువంటి IIT తిరుపతి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥ఇతర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో Junior Executive Assistant పోస్టులను భర్తీ చేయనున్నారు.మొత్తం ఖాళీలు 10 ఉన్నాయి ఖాళీల సంఖ్య అవసరాలకు అనుగుణంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
విద్యార్హతలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కింది విభాగాల్లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.BA, B.Sc, B.Com, BBA, BCA కనీసం 55% మార్కులు లేదా సమానమైన CGPA సాధించి ఉండాలి.Finance & Accounts, Procurement, Academic Affairs, Administration, HR వంటి విభాగాల్లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే MS Office, MS Excel, PowerPoint, Email Communication వంటి అంశాలపై పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు. అనుభవం కలిగిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు పరిగణించవచ్చు.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 నుంచి ₹30,000 వరకు Consolidated Remuneration చెల్లిస్తారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, ఎంపిక ప్రక్రియలో చూపిన ప్రతిభ ఆధారంగా జీతం నిర్ణయిస్తారు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను కింది విధంగా ఎంపిక చేస్తారు.
1. అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన.
2. అర్హులైన అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్.
4. తదుపరి ఎంపిక ప్రక్రియ.
ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులకు TA/DA చెల్లించరు.
దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్లను Self Attested Copies రూపంలో స్కాన్ చేయాలి. అన్ని డాక్యుమెంట్లను ఒకే PDF ఫైల్ గా తయారు చేసి కింది ఇమెయిల్ కు పంపించాలి.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్:
outsourcing_rect@iittp.ac.in
దరఖాస్తు పంపడానికి చివరి తేదీ: 22 నవంబర్ 2026.
దరఖాస్తు చేసిన అభ్యర్థులు హార్డ్ కాపీలను పంపించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 11-11-2026
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: నోటిఫికేషన్ ప్రకారం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2026

ముఖ్యమైన గమనిక:
ఈ ఉద్యోగాలు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు కావు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఒక సంవత్సరం కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు IIT తిరుపతిలో పనిచేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగ హక్కు ఉండదు.
ముఖ్యమైన లింక్స్:
Official Notification PDF:
https://files.iittp.ac.in/2026/recruitment/Outsourced/OIFMIITTRECT-OS26-202716.pdf
Apply Through Email:
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం Jobsguruvu.com వెబ్సైట్ ను సందర్శించండి.
