Andhra Bank LBO Jobs 2024:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) గతంలో ఆంధ్ర బ్యాంక్ నుండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) 1500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 200 ఖాళీలు మరియు తెలంగాణలో 200 ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు తెలుగు తప్పనిసరిగా మాట్లాడటం చదవడం రావాలి 24 అక్టోబర్ నుండి 13 నవంబర్ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥Share Chat సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ ఇంటి నుండి పని చేసుకోండి
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేశారు ఇందులో మొత్తం 1500 ఖాళీలు ఉన్నాయి అందులో
- ఆంధ్రప్రదేశ్ – 200 ఖాళీలు
- తెలంగాణ – 200 ఖాళీలు
విద్యా అర్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయుటకు అర్హులు అలాగే రాష్ట్ర భాష అయిన తెలుగు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
🔥కాల్స్ చేసి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు లింక్ 24 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమవుతుంది
- దరఖాస్తు చేయడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 13 నవంబర్ 2024
వయస్సు:
అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఇస్తారు
జీతం:
ఈ Andhra Bank LBO Jobs 2024 లో మీరు ఎంపిక అయితే జీతం 48,480 నుండి 85,920 బేసిక్ పే ఉంటుంది. అన్ని రకాల అలవెంసులు మరియు బెనిఫిట్స్ బ్యాంక్ నుండి లభిస్తాయి.
🔥12th అర్హతతో జూట్ బోర్డులో ఉద్యోగాలు
దరఖాస్తు రుసుము:
ఈ Andhra Bank LBO Jobs 2024 సంబంధించి దరఖాస్తు చేయడానికి ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు 175 రూపాయలు ఫీజు
- మిగిలిన జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులు 850 రూపాయల ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలో పరీక్ష నిర్వహిస్తారు మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష రాయాలి అందులో రీజనింగ్, జనరల్ అవేర్నెస్,డేటా అనాలసిస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Andhra Bank LBO Jobs 2024 కు ఆన్లైన్ లో పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు ఆన్లైన్ దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి
1 thought on “AP, TS లో ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగాలు | Andhra Bank LBO Jobs 2024 | UBI LBO Recruitment 2024 | Union Bank Jobs”