Annadata Sukhibhava Update:
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయని రైతులు ఎదురుచూస్తున్నారు వారికి తాజా అప్డేట్ రావడం జరిగింది ఈ సమాచారాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు. ఆయన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ Annadata Sukhibhava పథకం కింద రైతులకు 20,000 అందించే కార్యక్రమం వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు జమ చేసే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుందని వెల్లడించారు. కేంద్రం మొత్తం మూడు విడతల్లో అందించే సమయంలో మన అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా అందిస్తామని మొత్తం 20000 అందించే విధంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
🔥పోస్టల్ శాఖ వారు ఇంటి నుండి పని
Annadata Sukhibhava Date:
కేంద్ర ప్రభుత్వం ఈనెల చివరి నాటికి పీఎం కిసాన్ డబ్బులు వేస్తుందని రైతులందరూ భావించారు కానీ వచ్చే నెల అనగా జూలై నాటికి దీనిని వాయిదా వేయడం జరిగింది. ఏ తేదీన వేస్తారో సమాచారం త్వరలో తెలుస్తుంది ఆ రోజున అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యనుంది ఇంకా ఎవరైనా రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఈ విడత లో కేంద్ర ప్రభుత్వం 2000 రాష్ట్ర ప్రభుత్వం 5000 మొత్తం రైతులకు ₹7,000 జమ చేస్తారు.
ఇప్పటికే రైతులకు ఈ డబ్బులు అందించాలి కానీ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాయిదా వేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం చాలామంది రైతులు పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని ఆ కారణంతో వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇంకా మన రాష్ట్రంలో 64 వేల మంది రైతులు ఈ కేవైసీ పెండింగ్ ఉంది. ఈ విధంగా రైతులు ఎవరైనా పెండింగ్ ఉన్నవారు వెంటనే మీ సమీప రైతు సేవా కేంద్రంలో పూర్తి చేసుకోండి.
ఇటువంటి Annadata Sukhibhava పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి
1 thought on “Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ మరింత ఆలస్యం”