AP 10th Marks Memo 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th పాసైన విద్యార్థులకు శుభవార్త విద్యాశాఖ వెబ్సైట్లో సబ్జెక్టులు వారిగా మార్కుల లిస్ట్ షార్ట్ మెమో విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిని డౌన్లోడ్ ఎలా చేయాలి వీటివల్ల ఉపయోగాలు ఏమిటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP 10th విద్యార్థుల సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP లో 10th పాస్ వారికి భారీగా జాబ్
How to Download AP 10th Marks Memo..?
విద్యార్థులు నేరుగా ఈ షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు ఉండదు. వాటిని స్కూల్ లాగిన్ నుంచి HM లు డౌన్లోడ్ చేసుకొని వాటిపైన సంతకం చేసి విద్యార్థులకు అందజేయాలి వీటిని నేరుగా మీరు తీసుకుని వెళ్లి ఇంటర్ లేదా మీరు తదుపరి చదివే కళాశాలల్లో సమర్పించవచ్చు ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు వెల్లడించారు. స్కూల్ అడ్మిషన్ రికార్డ్ తో పాటు HM అటెస్ట్ చేసిన షార్ట్ మెమో కాపీలను ఈనెల 25 లోగా మండల విద్యాశాఖ అధికారులకు అందజేయాలని తెలిపారు.
పై తెలిపిన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అభ్యర్థులకు ఒరిజినల్ మార్క్స్ మెమో రావడం జరుగుతుంది. వాటికి ఇంకా మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది అప్పటివరకు విద్యార్థులు ఈ షార్ట్ మెమో మీకు కావాల్సిన చోట వినియోగించుకోవచ్చు ఏదైనా సందేహాలు ఉంటే మీ స్కూల్ హెడ్ మాస్టర్ ను అడిగి తదుపరి విషయాలు తెలుసుకోవచ్చు.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థుల సమాచారం వరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.