AP DSC 2025 Update:
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే జూలై రెండవ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం షిఫ్టులు వారిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే డీఎస్సీ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) ఉద్యోగానికి సంబంధించి కేటగిరి వారిగా గతంలో నిర్వహించిన డీఎస్సీ మరియు జిల్లాల వారీగా ఉన్న పోస్టులు కేటగిరి వారిగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆధారంగా Expected కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు వారికోసం పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు అన్ని వివరాలు వివరించడం జరిగింది. పూర్తి వివరాలు చదివి తెలుసుకోండి.
Cut Off Marks ఎలా పరిగణించాలి:
- ప్రశ్నాపత్రం యొక్క కఠిన స్థాయి.
- పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య
- షిఫ్టులు వారీగా ప్రశ్నాపత్రం యొక్క కఠినతనం.
- క్యాటగిరి వారిగా రిజర్వేషన్ మరియు వెయిటేజీ
- TET వెయిటేజీ పరిగణించాలి.
- ఆరోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరైన అభ్యర్థులు ఆధారంగా ఉంటుంది.
AP DSC 2025 SGT Cut Off Marks:
ప్రస్తుతం తెలియజేస్తున్న కటాఫ్ మార్కులు జిల్లాల వారీగా మారే అవకాశం ఉంది అలాగే కొన్ని కేటగిరి వారికి కొంత తక్కువ మరియు కొంత ఎక్కువ కట్ కూడా ఉండే అవకాశం ఉంది ఇది కేవలం Expected Cut Off marks మాత్రమే.
- OC Male – 68 To 73
- OC Female – 66 To 71
- BC- A – 60 To 65
- BC- B – 61 To 66
- BC- C – 58 To 63
- BC- D – 60 To 65
- BC – E – 58 To 63
- SC -A – Just Qualify
- SC- B – 55 To 60
- SC- C – 55 To 60
- ST – 55 To 60
- EWS – 62 – 67
- VH/OH/HH – 40 TO 45
Note: కట్ ఆఫ్ మార్కులు జిల్లాల వారీగా స్వల్పంగా మారే అవకాశం ఉంది ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో కటాఫ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది తక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో కటాఫ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
AP DSC 2025 ప్రాథమిక కీ విడుదల ఎప్పుడు:
ఆంధ్రప్రదేశ్ లో SGT పరీక్షలు 21 జూన్ తో ముగించాలి కానీ యోగాంధ్ర కార్యక్రమం కారణంగా జూన్ 20, 21 పరీక్షలను జూలై 1,2 తేదీలకు మార్పు చేశారు కావున ప్రాథమిక కీ జూలై 4వ తేదీ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రాథమిక కి విడుదల అయిన తర్వాత అవే మనకు ఉద్యోగం తెచ్చిపెట్టి మార్కులు అనుకోకూడదు ఎందుకంటే షిఫ్టుల్లో వారీగా కొన్ని షిఫ్టుల్లో ప్రశ్న పత్రం చాలా కఠినంగా రావడం జరిగింది కావున అభ్యర్థులు చివరి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాలి.
ఇటువంటి AP DSC 2025 సమాచారం రోజు పడడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Hii sir I’m from kurnool may I know the cut off marks of school maths from kurnool sir pls respond.
Above 75 is good marks sir