AP GGH Contract Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, నర్స్, వార్డ్ బాయ్స్, అకౌంటెంట్ కం క్లర్క్, చౌకిదార్ మరియు హౌస్ కీపింగ్ సంబంధించిన పోస్టులు ఇందులో ఉన్నాయి దరఖాస్తు చేయడానికి 9 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా ఆఫ్లైన్ విధానంలో మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి GGH ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 31 మార్చి 2026 నుండి 9 ఏప్రిల్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హత ఉంటే తప్పకుండా అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నెల్లూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో (GGH) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, నర్స్, వార్డ్ బాయ్, అకౌంటెంట్ కం క్లర్క్, పీర్ ఎడ్యుకేటర్, చౌకిదార్, హౌస్ కీపింగ్ మరియు యోగా టీచర్ ఖాళీలు ఇందులో ఉన్నాయి.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి 5000/- నుండి 60,000/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉండవు.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి 7, 10, ఇంటర్, 12, డిప్లొమా మరియు డిగ్రీ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు సమర్పించవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు ఓసి మరియు ఓబిసి అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 300 రూపాయలు ఫీజు DD రూపంలో చెల్లించి అప్లికేషన్ ఫారం తో పాటు రిసిప్ట్ దరఖాస్తు సమయంలో ఇవ్వాలి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించిన తర్వాత 9 ఏప్రిల్ 2026 సాయంత్రం ఐదు గంటల లోపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH) నెల్లూరు వారికి మీ అప్లికేషన్ సమర్పించాలి.
ఇటువంటి AP GGH ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
