AP Govt Holidays 2025:
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సెలవుల లిస్ట్ 2025 సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 23 జనరల్ హాలిడేస్ ఉండగా అందులో నాలుగు ఆదివారాల్లో రావడం జరిగింది. ఐచ్చిక సెలవులు (Optional Holidays) మొత్తం 21 ఉండగా అందులో రెండు ఆదివారాల్లో రావడం జరిగింది. ఈ సెలవులు అన్ని ప్రభుత్వ సంస్థలు మరియు పాఠశాల లకు వర్తిస్తాయి. ఇందులో రంజాన్ బక్రీద్ మరియు మొహరం నందు ఏదైనా తేదీలు మార్పు వస్తే స్వల్పంగా ఇందులో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది.
🔥 ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి
AP Govt Holidays 2025 General:
జనరల్ హాలిడేస్ నందు అన్ని ప్రభుత్వ సంస్థలు పూర్తిగా సెలవులో ఉంటాయి ఈ జనరల్ హాలిడేస్ వివరాలు క్రింద పట్టికలో చూడవచ్చు.
AP Govt Holidays 2025 Optional:
ఆప్షనల్ హాలిడేస్ వీటిని ఐచ్చిక సెలవులు అంటారు వీటిని ప్రభుత్వం పూర్తిగా సెలవు దినంగా ప్రకటించరు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది వారి పండుగలు మరియు కార్య క్రమాలు అనుసారంగ ఈ సెలవులు ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగి 5 ఐచ్చిక సెలవులను ప్రతి సంవత్సరం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఐచ్చిక సెలవులు వివరాలు క్రింద పట్టికలో చూడవచ్చు.
వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆరు డిసెంబర్ 2024న జీవో నంబర్ 2115 విడుదల చేయడం జరిగింది. ఈ జీవో కాఫీ క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.