AP IIIT Admissions 2025:
ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ( AP IIIT RGUKT) వారు ఆరు సంవత్సరాల బిటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కోసం IIIT ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ సంస్థలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు మరియు శ్రీకాకుళం క్యాంపస్ లు ఉన్నాయి పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఇందులో ప్రవేశాలు ఉంటాయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఇటువంటి AP IIIT అడ్మిషన్స్ ప్రవేశ సమాచారం కోసం పైన ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
AP RGUKT IIIT అడ్మిషన్స్ పూర్తి వివరాలు:
అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన వారు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్ర ప్రదేశ్ ఇందులో మొత్తం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ ఉంటుంది 27 ఏప్రిల్ 2025 నుండి 20 మే 2025 వరకు ఇందులో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
అర్హత వివరాలు:
- 2024-25 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
- దరఖాస్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి అవకాశం ఉంటుంది.
- ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు వచ్చిన వారికి ఎక్కువగా ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తు చేయడానికి ముందుగా అభ్యర్థులు WWW.RGUKT.in వెబ్సైట్ సందర్శించాలి.
- వెబ్సైట్ నందు అడ్మిషన్స్ 2025 అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేయాలి.
- కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి.
- అందులో 10th మార్క్స్, కుల దృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
పైన తెలిపిన విధంగా అభ్యర్థులు అర్హత ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి AP IIIT సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
3 thoughts on “AP IIIT అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల 10th విద్యార్థులకు మంచి అవకాశం”