AP Job Calendar 2026:
ఆంధ్రప్రదేశ్ లో Job Calendar సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతం విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరించారు ఇప్పటివరకు సేకరించిన ఖాళీల్లో నేరుగా ఉద్యోగాలు భర్తీ చేసే పోస్టులు 99 వేలు ఉన్నాయి ఇంకా 24 శాఖల వారు వివరాలు వెల్లడించలేదు అవన్నీ కలిపితే దాదాపు 1.30 లక్షల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటుంది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈ నేపధ్యంలో ఖాళీల వివరాలను ప్రభుత్వం వారు వెల్లడించారు వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి AP Job Calendar సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥భారీగా 1332 సచివాలయం అసిస్టెంట్ జాబ్స్
Job Calendar పోస్టుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ భర్తీ చేసే పోస్టులు ఇప్పటివరకు 157 విభాగల వారు వెల్లడించారు అందులో 30% వరకు ఖాళీలు ఉన్నాయి ఖాళీల వివరాలు పరిశీలిస్తే మొత్తం 99 వేలు నేరుగా భర్తీ చేసే పోస్టులు ఇవ్వనున్నారు వాటిలో కొన్ని పోస్టుల వివరాలు చూసుకుంటే.
- పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలు చేపట్టాల్సిన పోస్టులు 26 వేల వరకు ఉన్నాయి.
- వ్యవసాయ శాఖలో నేరుగా భర్తీ చేసే పోస్టులు 2400 ఉన్నాయి.
- రెవెన్యూ శాఖలో 13 వేల ఖాళీలు ఉంటే అందులో నేరుగా భర్తీ చేసే పోస్టులు 2552 ఉన్నాయి.
- ఉన్నత విద్యా శాఖలో 7వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి అలాగే విశ్వవిద్యాలయాల్లో 3 వేల ఖాళీలు భర్తీ చేయాలి.
- పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖలో 23 వేల ఖాళీలు నియామకాలు చేపట్టాలి.
- శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి శాఖలో 2600 ఖాళీలు నియామకాలు చేయాలి.
- మహిళ, శిశు సంక్షేమ శాఖలో 2400 ఖాళీలు ఉన్నాయి వాటిలో 1820 పోస్టులు నేరుగా భర్తీ చేయాలి.
🔥ఏపీ ఐసిడిఎస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
Job Calendar ఇంకా వెల్లడించని పోస్టులు:
24 శాఖల్లో విభాగంలో ఖాళీల వివరాలు ఇంకా నిర్ధారించలేదు వాటి వివరాలు పరిశీలిస్తే పాఠశాల విద్యాశాఖలో ప్రాథమిక అంచనా మేరకు 30 వేల ఖాళీలు ఉన్నాయి అలాగే. ఆరోగ్య శాఖలో 10 వేల ఖాళీలు భర్తీ చేయాలి ఇంకా చాలా రకాల విభాగంలో ఖాళీల వివరాలు త్వరలో వెల్లడిస్తారు ఇవ్వని కలిపి దాదాపు 1.3 లక్షల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
Job Calendar విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని వెల్లడించడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయుటకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం వారు చేస్తున్నారు దీనిలో భాగంగా జనవరి నెలలో మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ విడుదల చేసి వాటికి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది కావున అభ్యర్థులు అప్పటినుండే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి.

అన్ని రకాల విభాగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు కావున ఇప్పటినుండి మీరు చదువుకొని సిద్ధంగా ఉంటే నోటిఫికేషన్ వచ్చేలాటికి కచ్చితంగా ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది.
ఇటువంటి ఏపీ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Job Calendar 2026: గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ లో భారీగా 99 వేల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్”