AP Jobs Calendar 2024:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం రావడం జరిగినది ఆ సమాచారాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే.
ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ విధానంలో చేపట్టాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతోంది ప్రభుత్వం పదిమంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది ఈ కమిటీ ఇచ్చిన AP Jobs Calendar 2024 ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
- ఈ కమిటీ యూపీఎస్సీ తో పాటు రాజస్థాన్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కార్యకలాపాలను పరిశీలించి ఈ ప్రతిపాదనను రూపొందించడం జరిగినది.
- ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్A,B, స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్, స్టేట్ జనరల్ సర్వీసెస్ కింద వర్గీకరించాలి.
- ఉమ్మడి రాష్ట్రంలో 1985 డిసెంబర్ 14న ఇచ్చిన జీవో నెంబర్ 275 లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అనే నిబంధనను తొలగించాలి.
- ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జలగాలి ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్తో తయారుచేసి వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్సీకి అందించాలి.
- ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలకు రాజస్థాన్ లో మాదిరిగా అక్కడికక్కడే మార్కులు స్క్రీన్ పై తెలిపే విధానాన్ని అనుసరించాలి.
- కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జాబ్ క్యాలెండర్ విధానం లేదు కానీ పోస్టులు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేస్తున్నారు ఆర్థిక శాఖ ఆమోదంతో నిమిత్తం లేకుండా ఆ ఖాళీల వివరాలు కమిషన్ కు వెళ్తున్నాయి.
- ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ రుసుమును ప్రభుత్వానికి కాకుండా నేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చేరేలా ఆదేశాలు ఇవ్వాలి.
- వ్యాస రూప ప్రశ్నలను ఒక్కో నిప్పునుడి నుండి ఒకటి లేదా రెండు మాత్రమే తయారు చేయించాలి.
ఏపీ లో 700 పోస్టులు భర్తీ చేస్తున్నారు
ఇండియన్ బ్యాంక్ లో ఏపీ లో ఉద్యోగాలు
AP Jobs Calendar 2024 Date:
అందరూ నిరుద్యోగులు ఎదురుచూస్తున్నది జాబ్స్ క్యాలెండర్ విడుదల తేదీ గురించి ప్రస్తుతం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు ప్రతి ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలను ఏటా మార్చ్ ఒకటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ లోపల సంబంధిత కార్యదర్శుల కు పంపాలి. కార్యదర్శులు మీ ఒకటవ తేదీ నుంచి జూలై 30వ తేదీ లోపల వాటిని ఆమోదం తెలపాలి.
ఆన్లైన్ ద్వారా ఈ వివరాలు అందిన వెంటనే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా చర్చించారు. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో త్రాడ్ పార్టీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి.
ఇది ఇప్పటి దాకా ఉన్న AP Jobs Calendar 2024 వివరాలు ఎటువంటి సమాచారం తెలిసిన మన వెబ్సైట్ ద్వారా మీకు పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు