AP New Kapu Scheme Gruhini:
ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు గుడ్ న్యూస్ ఆర్థిక చేయూత అందించాలి అనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు ఈ పథకం పేరు ఏమిటి? ఎవరికి లబ్ది అనే వివరాలు పరిశీలిస్తే ఈ పథకం పేరు గృహిణి. ఈ పథకం ద్వారా కాపు మహిళలకు ఉచితంగా 15 వేలు ఇవ్వనున్నారు దీనిని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలియజేశారు ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలు అందరికీ 15000 ఉచితంగా ఇస్తామని వెల్లడించారు దీనికోసం సుమారు ప్రభుత్వానికి 400 కోట్లు అవసరం అవుతుందని వెల్లడించారు త్వరలో ఈ స్కీం అమలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో వైయస్సార్ కాపు నేస్తం ద్వారా ప్రతి సంవత్సరం కాపు మహిళలకు 15 వేలు అందించేవారు ఆ విధంగా ఐదు సంవత్సరాలకు 75 వేలు ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం కాపు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం గృహిణి అనే పథకాన్ని తీసుకురావాలని భావిస్తోంది ఇందులో కూడా గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఉచితంగా 15 వేలు అందించాలని భావిస్తున్నారు వీటికి సంబంధించి విధివిధానాలు త్వరలో విడుదల చేస్తారు.
గతంలో ఈ పథకానికి 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులుగా ఉండేవారు ఇప్పుడు కూడా అదే కొనసాగవచ్చు గృహిణి పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడించారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో లేని కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నారు ఆ విధంగానే ఈ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి లేదా పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
1 thought on “Gruhini: ఏపీ లో మహిళలకు గుడ్ న్యూస్.. 15 వేలు మీ ఖాతాలో ఉచితంగా వేసే కొత్త పథకం”