AP Ration Card Update:
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు కొత్త సర్వీసులను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం వాటిపైన తాజా అప్డేట్ రావడం జరిగింది ఆ సమాచారం పరిశీలిస్తే గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం వెల్లడించింది. YCP హయాంలో వచ్చిన అప్లికేషన్ లో 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించింది వాటిని పరిశీలించి అర్హులు ఉంటే ఆమోదం ఇస్తారు.
ఇటువంటి AP Ration Card సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి
🔥CCI లో భారీగా ఉద్యోగాలు భర్తీ
AP Ration Card in WhatsApp:
ఇప్పటికే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఏడు రకాల Ration Card సర్వీసులు ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే ఈనెల 15 వ తేదీ నుండి వాట్సప్ మన మిత్ర ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు జూన్ లో కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కావున అర్హులు అయిన వారు వాట్సాప్ మన మిత్ర ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు.
How to Apply an AP Ration Card in WhatsApp.?
వాట్సప్ లో రేషన్ కార్డు దరఖాస్తు కొరకు ముందుగా 9552300009 నంబర్ మీ మొబైల్ లో సేవ్ చేయాలి ఆ తర్వాత పై తెలిపిన నెంబర్ కు వాట్సప్ ద్వారా Hi అని మెసేజ్ చేయగానే మీకు ఈ సేవలకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం ఏడు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి అవి.
🔥IOB బ్యాంకులో 400 పోస్టులు భర్తీ
- కొత్త కార్డులు కొరకు
- బియ్యం కార్డులో సభ్యులు చేర్పులు
- బియ్యం కార్డు నుండి సభ్యులు విభజన
- బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు (Death cases only)
- కార్డులు సరెండర్
- బియ్యం కార్డులో చిరునామా మార్పు
- తప్పుగా నమోదు అయిన ఆధార్ సీడింగ్ దిద్దుబాటు చేయడం
పై వివరాలు పరిశీలించి గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయకండి అలాగే వాట్సప్ ద్వారా కూడా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ అవకాశాలను వినియోగించుకోండి.
ఇటువంటి రేషన్ కార్డు సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.