AP లో వాలంటీర్ల నియామకం పై శుభవార్త  | AP Volunteer Recruitment Update | AP Volunteer Notification 2024

AP Volunteer Recruitment Update:

ఏపీలో వాలంటీర్ల ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే శుభవార్త విని అవకాశం ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత వాలంటీర్ల సంఖ్య 2,54,832 ఇందులో 1,26,659 మంది ప్రస్తుతం పని చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఒక లక్ష 8 వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడం జరిగినది.ఆ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఏపీ లో నూతన వాలంటీర్ నియామకం జరగనున్న నేపథ్యంలో వాలంటీర్ పేరును సేవక్ గా మార్చనున్నారు ఇంతక ముందు కేవలం ఒక వాలంటీర్ కు 50 ఇళ్లు ఉండేవి ప్రస్తుతం 100 ఇళ్ళు కేటాయించే అవకాశం ఉంది.

ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల మరియు ప్రభుత్వ పథకాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

AP Volunteer Recruitment Govt Decision:

నూతన ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగింపు పై త్వరలో కీలక నిర్ణయం తీసుకొని ఉన్నట్లు సమాచారం వస్తుంది జూలై 16న క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు అందులో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వీటికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. 

ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని వారు జీతాలు కూడా పెంచుతామని హామీ కూడా ఇవ్వడంతో ఈ వ్యవస్థ రద్దు అయ్యే అవకాశం చాలా తక్కువ.

AP volunteer jobs 2024

వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ పై కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్త వాలంటీర్లను నియమించాలని ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు. 

అనగా మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది అంటే మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఉంది. 

వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసే వారికి ఈ మూడు సంవత్సరాలలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని ఆ తర్వాత వాళ్లకు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇది ఒక శుభవార్తగా మనం అనవచ్చు వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP Volunteer Recruitment 2024 Eligibility:

ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది. 

AP Volunteer Recruitment 2024 Salary:

గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5000 రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్ కు 10000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరిగినది దానికి అనుగుణంగా నూతన నియామకాల తరువాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం తెలుస్తోంది.

ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 

పర్మినెంట్ ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు 

ఏపీ లో 70 వేల వాలంటీర్లు నియామకం

AP Volunteer Recruitment 2024 Documents:

వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్లు 

  • 10/ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్లు 
  • ఆధార్ కార్డు 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • బ్యాంక్ పాస్ బుక్ 
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో

AP Volunteer Recruitment 2024 Selection:

ఏపీ లోని నూతన వాలంటీర్ నియామకాలు సంబంధించి చాలా మందికి ఉన్న సందేహం ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 

AP Volunteer jobs notification

How Many Houses Allotted For Volunteer:

గతంలో ఒక వాలంటీర్ కు 50 ఇండ్లను కేటాయించేవారు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం 100 ఇళ్లకు ఒక వాలంటీర్ను కేటాయిస్తారు అనే సమాచారం కూడా ఉంది అఫీషియల్ గా పూర్తి సమాచారం వచ్చేవరకు ఎన్ని ఇండ్లు కేటాయిస్తారు అనేది ప్రస్తార్థకంగా మారింది. 

AP Volunteer Recruitment Update 2024 Work:

గతంలో వాలంటీరు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల ఆఫీసు నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ పని చేయాల్సి ఉంటుంది. 

How to Apply AP Volunteer Recruitment Update:

వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు క్రింద ఇంకా మనకు దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు విడుదల కావాల్సిన అవసరం ఉంది కావున అప్పటివరకు వేచి చూడాలి ఇది జూలై మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Join Telegram Group

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

2 thoughts on “AP లో వాలంటీర్ల నియామకం పై శుభవార్త  | AP Volunteer Recruitment Update | AP Volunteer Notification 2024”

Leave a Comment

error: Content is protected !!