APCOB Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో సహకార బ్యాంక్ అయిన ఆంధ్రప్రదేశ్ కొఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) నుండి స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 251 పోస్టులు ఉన్నాయి. జనవరి 22 దరఖాస్తు చేయుటకు చివరి తేదీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి APCOB ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపీ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ 7 జనవరి 2025 విడుదల చేశారు దరఖాస్తు చేయుటకు 8 జనవరి నుండి 22 జనవరి 2025 వరకు అవకాశం ఉంది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (APCOB) వారు విడుదల చేశారు ఇందులో 251 స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి వీటిని శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు మరియు కర్నూల్ జిల్లాలో భర్తీ చేస్తున్నారు.
🔥ఏపీలో 10th అర్హత ఔట్ సోర్సింగ్ జాబ్స్
విద్యా అర్హత:
ఈ APCOB ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే చాలు. తెలుగు చదవడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ కూడా తెలియాలి.
ఖాళీల వివరాలు:
- అసిస్టెంట్ మేనేజర్ – 50 పోస్టులు ( గుంటూరు 31, శ్రీకాకుళం 19)
- స్టాఫ్ అసిస్టెంట్ – 201 ( శ్రీకాకుళం 35, గుంటూరు 50, కృష్ణ 66, కర్నూల్ 50)
వయస్సు వివరాలు:
దరఖాస్తు చేయుటకు కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥AP లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు OC, BC అభ్యర్థులకు 700/- రూపాయలు ఫీజు. మిగిలిన SC, ST, అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT By IBPS) నిర్వహించి అందులో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు. పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు అందులో ఇంగ్లీష్ 30 మార్కులు, రీజనింగ్ 35 మార్కులు, ఆప్టిట్యూడ్ 35 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు 0.25 అనగా 4 తప్పులకు ఒక మార్కు తీసి వేస్తారు.
🔥AP RTGS లో కొత్త ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు 22 జనవరి వరకు అవకాశం ఉంది అర్హులు వెంటనే ఆన్లైన్ ద్వారా మీ వివరాలు ఇచ్చి ఫీజు చెల్లించి దరఖాస్తు చెయ్యండి.
ఇటువంటి APCOB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “APCOB Jobs 2025: ఏపీ సహకార బ్యాంక్ లో 251 ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత ”