APPSC Notifications 2025:
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు APPSC కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధం అవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఎస్సీ వర్గీకరణ దృశ్య ఆలస్యం అవ్వడం జరిగింది. మొత్తం 18 శాఖల్లో 866 పోస్టులు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి.
ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
APPSC Notifications Update:
అటవీ శాఖలో 814 పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోస్టుల వారీగా పరిశీలిస్తే.
- సెక్షన్ ఆఫీసర్ 100 ఖాళీలు భర్తీ చేయాలి
- బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 691 ఖాళీలు ఉన్నాయి.
- ట్రాప్స్మెంట్ గ్రేట్ 2 పోస్టులు 13 ఉన్నాయి అలాగే తానేదార్ పది ఖాళీలు ఉన్నాయి.
ఇవి కాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ 10, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖ 7, జిల్లా సైనిక అధికారి 7, గ్రంథాలయ ఆఫీసర్ 2, హార్టికల్చర్ ఆఫీసర్ 2, జూనియర్ అకౌంటెంట్ 11 ఇలా వివిధ ఉద్యోగాలు భర్తీ కొరకు ఎస్సీ వర్గీకరణ కోసం వేచి ఉన్నాయి ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు అన్ని విడుదల చేయనున్నారు.
🔥విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు..?
ఈ నోటిఫికేషన్ లు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్టు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు ప్రస్తుతం ప్రారంభిస్తే నెల రోజుల్లో పూర్తి చేయవచ్చు ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీకి చర్యలు తీసుకుంటుంది కావున ఆ శాఖలు వెంటనే స్పందించి రోస్టర్ పాయింట్లు ప్రిపేర్ చేస్తే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది ఎటువంటి సమాచారం తెలిసిన మీకు వెంటనే మన వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
ఇటువంటి APPSC ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.