Digital Lakshmi 2025 Details:
ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆన్లైన్ దరఖాస్తు చేయాలి అలాగే ఇతర ప్రభుత్వ పథకాల రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ లో వివరాలు అప్లోడ్ తప్పనిసరి వ్యాపార లైసెన్స్ తీసుకోవాలన్న, రేషన్ కార్డు దరఖాస్తు చేయాలన్న ఇలా ప్రతిదానికి డిజిటల్ సేవలు అనేవి చాలా అవసరం అవుతాయి. పట్టణ పేదల ఇంటి వద్దకే ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ లక్ష్మి(Digital Lakshmi) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా 10,000 కియోస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలో ప్రారంభించే ఈ సెంటర్లలో మొదటగా 20 సేవలు అందుబాటులోకి వస్తాయి విడతలవారీగా దాదాపు 200 సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇటువంటి Digital Lakshmi ఇలాంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP DSC హాల్ టికెట్స్ వచ్చేశాయి
AP Digital Lakshmi Information:
పట్టణ స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివిన వారికి ఉపాధి కల్పించడానికి ముఖ్యంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా ప్రజలకు డిజిటల్ సేవలు అందించే కార్యక్రమమే ఈ డిజిటల్ లక్ష్మి దీనిని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) రూపొందించింది. ఇందులో 300 కుటుంబాలకు ఒక కియోస్క్ సెంటర్ ఏర్పాటు చేస్తారు దానికి అయ్యే ఖర్చు రెండు లక్షలు వరకు బ్యాంకు రుణం అందిస్తారు ఇందులో కంప్యూటర్, ప్రింటర్, స్కాలర్ మరియు ఇతర పరికరాలు ఉంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి అవకాశం కల్పిస్తారు తొలి దశలో 4000 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ముందుగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు దశలవారీగా అన్ని పట్టణాల్లో ఈ అవకాశం కల్పిస్తారు. దీని ద్వారా పథకాలు దరఖాస్తు ఒకటే కాకుండా పన్నులు, కరెంట్ బిల్లులు, ఇతర బిల్లులు చెల్లింపు చేయడానికి అవకాశం కల్పిస్తారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది మీ సేవలో లభించే అన్ని సేవలు ఇందులో ఉంటాయి.
AP Digital Lakshmi Apply Process:
డిజిటల్ లక్ష్మి దరఖాస్తు కొరకు అభ్యర్థులు మీ స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన లీటర్లు లేదా మున్సిపల్ ఆఫీస్ నందు MEPMA వారిని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు వారి ద్వారా దరఖాస్తు చేసి మీరు దీనికి అర్హత సాధించవచ్చు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు లభించిన వెంటనే మేము కూడా మీకు అప్లికేషన్ ఫారం అందిస్తాము.
ఇటువంటి Digital Lakshmi సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “10 వేల మందికి డిజిటల్ లక్ష్మి అవకాశం | Digital Lakshmi Vacancies, Apply Process, Eligibility”