Digital Lakshmi Details:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే తాజాగా డిజిటల్ లక్ష్మి పథకం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి చేయాలని వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా వారు ఇంటి వద్దనే ఉండి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా 9034 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు చూడండి క్రింది ఇవ్వడం జరిగింది.
ఇటువంటి Digital Lakshmi పథకాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥Airport లో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ
ఎన్ని పోస్టులు, ఏం పని చేయాలి:
డిజిటల్ లక్ష్మి ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఉపాధి అవకాశం కల్పిస్తారు మొత్తం 9034 మందికి ఇందులో అవకాశం ఉంటుంది దీని ద్వారా మీరు కామన్ సర్వీస్ సెంటర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాలి అందులో 250 సర్వీసులు మీకు చేసే అవకాశం ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తారు. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు మొదలైన వాటిని చెల్లిస్తూ ఆర్థిక లబ్ధి చేకూర్చే అవకాశాలు దీని ద్వారా ప్రభుత్వం ఇస్తుంది.
Digital Lakshmi ఎవరు అర్హులు:
- దరఖాస్తు చేయడానికి మహిళలు మాత్రమే అర్హులు.
- వయస్సు కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి.
- తప్పనిసరిగా డ్వాక్రా గ్రూపులో సభ్యులు అయి ఉండాలి.
- డిగ్రీ పాస్ అయిన వారికి మాత్రమే అవకాశం.
- మొబైల్ ఫోన్ వాడడం తెలిసి ఉండాలి.
- ఇంటి వద్ద 100 sq ft స్థలం కేటాయించి ఈ పని చేసుకోవచ్చు.
Digital Lakshmi దరఖాస్తు విధానం:
ఈ పథకానికి డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళ అర్హులు దరఖాస్తు చేయాలంటే మెప్మా సిబ్బంది ద్వారా లేదా మీ డ్వాక్రా గ్రూపు లీడర్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు దరఖాస్తు చేసిన వారికి రెండు లక్షల 50 వేలు రుణం అందిస్తారు ఆ రుణం ద్వారా ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి పథకానికి కావలసిన సామాగ్రి మొత్తం అందిస్తారు ఇంటి వద్ద నుండి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ప్రస్తుతానికి పట్టణాల్లో మాత్రమే ఉంది గ్రామాల్లో ఇంకా అందుబాటులో రాలేదు.
ఇటువంటి Digital Lakshmi పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.