Grama Sachivalayam News:
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు వారికి ఎటువంటి బదిలీలు లేవని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి DBV స్వామి తెలిపారు మహిళా పోలీసులకు హోం శాఖ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ కొనసాగిస్తారా అని ఆప్షన్ ఓపెన్ చేయడం జరిగింది వారి ఎంపికను అనుసరించి ఆ సిబ్బందిని ఆ శాఖ లోకి త్వరలో బదిలీ చేయనున్నారు ఇది కూడా రేషనలైజేషన్ లో భాగంగా చేస్తున్నారు పూర్తి వివరాలు పరిశీలిస్తే.
ఇటువంటి Grama Sachivalayam సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP పాఠశాలలు ప్రారంభం కోసం సిద్ధం
మహిళా పోలీస్ ఇతర శాఖలో ఆప్షన్..?
మహిళ సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్) ఉద్యోగులను ఇతర శాఖలో వెళ్లి ఆప్షన్ కల్పించడం జరిగింది వారు హోమ్ డిపార్ట్మెంట్ లేదా శిశు సంక్షేమ శాఖ రెండిట్లో ఒక ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించారు వారు ఇచ్చే ఆప్షన్ అనుగుణంగా వారిని ఆ శాఖలో త్వరలో బదిలీ చేయనున్నారు సచివాలయ సిబ్బంది లో ఇప్పటి దాకా ఎవరికి ఎటువంటి అవకాశం కల్పించలేదు మొదటి సారి ఈ అవకాశం మహిళా పోలీసులకు మాత్రమే తగ్గింది క్రింద ఇచ్చిన విధంగా వారికి ఆప్షన్ కోరుతున్నారు.
ఎందుకు వీరికి అవకాశం కల్పించారు అంటే చాలామంది మహిళా పోలీసులు వయస్సు అయినవారు ఉన్నారు వారికి పోలీసు విధులు కల్పిస్తే వారు చేయలేక పోతున్నారు కావున ఎవరైతే పోలీసు విధులు నిర్వహిస్తారు వారు హోం డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకుంటే వారికి PET, PMT పరీక్షలు నిర్వహించి వారు అర్హులు అయితే ఆ శాఖలో పదోన్నతులు కల్పించే అవకాశం ఉంటుంది.
సచివాలయాలు రేషనలైజేషన్ అయ్యాకే బదిలీలు.!
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఎవరిని మార్పు చేయమని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి DBV స్వామి తెలిపారు అలాగే సచివాలయాలు రియల్ టైం లో భాగంగా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని మారుస్తామని తెలియజేశారు.
సచివాలయాల్లో A, B, C కేటగిరి గా విభజించి ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేస్తామని మూడు వేలకు పైగా జనాభా గల సచివాలయాల్లో ఎనిమిది మంది సిబ్బంది ఉండేలా నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు ప్రస్తుతం సాధారణ బదిలీల సమయంలో సచివాలయ సిబ్బందికి ఎటువంటి బదిలీ అవకాశం ఇవ్వట్లేదు వీరి రేషనలైజేషన్ పూర్తి అయిన తర్వాత అవకాశం కల్పిస్తామని తెలియజేశారు.
ఇటువంటి Grama Sachivalayam సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.