NHAI Recruitment 2025:
రోడ్డు రవాణా శాఖ అయిన NHAI వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆఫీసులో పని చేయుటకు డిప్యూటీ మేనేజర్, లైబ్రరీ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఖాళీలు ఇందులో ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మరియు దరఖాస్తు చేసే విధానాన్ని క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NHAI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 30 అక్టోబర్ 2025 నుండి 15 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయవచ్చు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వారు విడుదల చేశారు ఇందులో డిప్యూటీ మేనేజర్, లైబ్రరీ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు 84 ఉన్నాయి. అత్యధికంగా అకౌంటెంట్ 42 ఖాళీలు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
ఇవి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే కనీసం 35,000/- గరిష్టంగా 75 వేల వరకు జీతం రావడం జరుగుతుంది అని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి దరఖాస్తు చేయడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ (https://www.nhai.gov.in) క్రింద అందుబాటులో ఉంచడం జరిగింది అర్హులైన అభ్యర్థులు 15 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి NHAI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
 
