Postal Work From Home:
ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వ సంస్థ నుండి పనిచేయాలి అనుకునే వారికి మంచి అవకాశం లభించడం జరిగింది. ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ ఔట్లెట్ స్కీమ్ 2025 ద్వారా మంచి అవకాశాన్ని Postal విశాఖ వారు అందిస్తున్నారు. ఇది ఒక ఉద్యోగం కాదు వ్యాపారంలా చేసుకుని అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వ సేవలను ఒక బ్రాంచ్ లా ఏర్పాటు చేసి ఒక ఆఫీసులో మీరు పనిచేయాలి ఇంటి వద్ద కూడా ఇది మీరు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది వీటి గురించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
🔥రైల్వే శాఖ లో 6500 ఉద్యోగాలు భర్తీ
Postal శాఖ వారు ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నారు:
భారతదేశ పోస్టల్ వ్యవస్థ తమ సేవలను విస్తృతస్థాయిలో ఏర్పాటు చేయాలి అలాగే అన్ని గ్రామాలు మరియు పట్టణాల వరకు సేవలను అందించాలి అని ఉద్దేశంతో ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవకాశాన్ని కల్పిస్తున్నారు.
Postal ఫ్రాంచైజ్ ద్వారా అందించే సేవలు:
- స్పీడ్ పోస్ట్ మరియు రిజిస్టర్ పోస్టులను బుక్ చేయడం.
- స్టాంపులు మరియు పోస్టల్ స్టేషనరీ విక్రయించడం.
- మనీ ఆర్డర్స్ చేయడం
- పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్ చేయడం
- ఈ గవర్నెన్స్ సేవలు, బిల్లులు చెల్లింపులు వంటి ఇతర సేవలు అందించడం.
ఆదాయం ఎలా వస్తుంది:
- స్పీడ్ పోస్ట్ లకు 7 నుండి 25% వరకు కమిషన్ ఇస్తారు.
- మనీ ఆర్డర్లకు మూడు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు ఉంటుంది.
- స్టాంపు లపై ఐదు శాతం వరకు లాభం ఉంటుంది.
- ఈ విధంగా ప్రాంతాలవారీగా 15000 నుండి 40 వేల వరకు ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.
దరఖాస్తు చేయడానికి కావలసిన అర్హతలు:
- 8 వ తరగతి లేదా పదవ తరగతి చదివి ఉండాలి.
- వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- కనీసం స్థలం 100 Sq.ft కలిగి ఉండాలి.
- 5000 నుండి 10000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి.
- బేసిక్ కంప్యూటర్ మరియు మొబైల్ వాడడం తెలిసి ఉండాలి.
దరఖాస్తు చేసే విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత జిల్లా పోస్టల్ డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి అధికారులు స్థలం పరిశీలించి మీకు అవకాశం కల్పిస్తారు ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఇంటి నుండే Postal సేవలు అందించే అవకాశం ఉంటుంది.
ఈ అవకాశాన్ని ఇంటి వద్ద ఏదైనా వ్యాపారం లేదా ఏదైనా దుకాణం చేస్తున్న వారు కూడా చేసుకోవచ్చు మీ వ్యాపారంతో పాటు దీనిని కూడా అభివృద్ధి చేసే అవకాశం మీకు లభిస్తుంది
1 thought on “Postal Work From Home: పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటి దగ్గరే పని చేసుకోండి, 40 వేలు సంపాదించండి”