Ration Card Latest News:
రేషన్ కార్డు దరఖాస్తు చేయడానికి ఎటువంటి చివరి తేదీ లేదు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరో సర్టిఫికెట్, పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో లేకుండానే దరఖాస్తులు చేయవచ్చని తెలియజేశారు పూర్తి వివరాలు పరిశీలిస్తే. కొత్త బియ్యం కార్డులు, పాత కార్డులో మార్పులు, చేర్పులు కొరకు స్వీకరిస్తున్న దరఖాస్తులకు ఎటువంటి చివరి తేదీ లేదు దరఖాస్తు చేసుకున్న తర్వాత 21 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని తెలియజేశారు. జూన్ లో QR కోడ్ తో మొత్తం 4 కోట్ల 24 లక్షల కార్డులు ప్రింట్ చేసి పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఇటువంటి Ration Card సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP స్కూల్స్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల
Ration Card Apply Process..?
రేషన్ కార్డు దరఖాస్తు చేయడానికి ఎటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి కార్డు అవసరం లేదని తెలియజేశారు చాలామంది మ్యారేజ్ సర్టిఫికెట్ కొరకు ఇబ్బంది పడుతున్నారని ఇది పరిశీలించిన ప్రభుత్వం వాటి పైన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ మేరకు గ్రామ మరియు వార్డు సచివాలయం కు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేర్లు తొలగింపు ప్రక్రియను కేవలం చనిపోయిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే కార్డులో పిల్లలను చేర్చడానికి వయస్సుతో సంబంధం లేదన్నారు ఈనెల ఏడవ తేదీ నుంచి ఇప్పటివరకు 5 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. రేషన్ కార్డులో డేటాను గ్రామ మరియు వార్డు సచివాలయం కు అనుసంధానం చేయడంతో సర్వర్లు డౌన్ అయ్యాయని దీనివల్ల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవమని మంత్రి అంగీకరించారు.
HouseHold Mapping Issues..?
గత ప్రభుత్వం నిర్వహించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వల్ల దరఖాస్తు చేసే సమయంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని వీటిపై ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి వారం రోజుల్లో ఈ సమస్యను పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇటువంటి Ration Card సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.
2 thoughts on “Ration Card: రేషన్ కార్డు దరఖాస్తు చివరి తేది లేదు.! ఇవి అవసరం లేదు ఇలా చేయండి”