TGSRTC Recruitment 2025:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC) వారు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు 20 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి TGSRTC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 30 డిసెంబర్ 2025 నుండి 20 జనవరి 2026 వరకు అవకాశం కల్పించారు అర్హులు ఏ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) వారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిని https://www.tgprb.in/ లో అందుబాటులో ఉంచారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ మరియు బిసి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
- ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగానికి ఇంజనీరింగ్ మెకానికల్ డిప్లమా లేదా ఆటోమొబైల్ డిప్లమా లేదా బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే బేసిక్ పే 27,080/- నుండి 82,400/- వరకు ఉంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 400 రూపాయలు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 800 రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని 20 జనవరి 2026 సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి TGSRTC ప్రత్యేక సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి

1 thought on “RTC Jobs 2025: ఆర్టీసీ లో సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ | TGSRTC Recruitment 2025”