Thalliki Vandanam Today:
ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మొత్తం ఈ పథకంలో భాగంగా ఒక విద్యార్థికి 15000 చొప్పున విడుదల చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వానికి 8745 కోట్లు ఖర్చు అవ్వనుంది మొత్తం విద్యార్థుల సంఖ్య 67,27,164 ఉన్నారు ఇందులో మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం వెయ్యి రూపాయలు, పాఠశాల నిర్వహణ నిధి కోసం వెయ్యి రూపాయలు మినహాయించి విద్యార్థుల తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి 13 వేలు చొప్పున ఈరోజు జమ చేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటవ తరగతిలో, ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమల్లో ఇబ్బంది లేకుండా సంబంధిత శాఖలకు సమన్వయం చేసుకోవాలని సూచించడం జరిగింది.
ప్రభుత్వం మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఎవరైనా పేర్లు లిస్ట్ లో లేకుండా వారికి డబ్బులు జమ కాకపోతే దరఖాస్తు చేయడానికి మరో అవకాశం కల్పిస్తామని వారికి తిరిగి నిధులు కూడా విడుదల చేస్తామని తెలియజేశారు ఈ లిస్ట్ వివరాలు ఎక్కడ చూసుకోవాలి అని చాలామంది సందేహ పడుతున్నారు. దానికోసం మీరు ఎక్కడ చూడవలసిన అవసరం లేదు మీ పిల్లలను పాఠశాలలకు పంపిస్తూ 75 శాతం హాజరు ఉండి. మీరు మీ బ్యాంక్ ఖాతా కు ఆధార్ లింక్ చేసుకొని ఉంటే చాలు మీకు డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది ఒకవేళ జమ అవ్వక పోతే దరఖాస్తు చేయడానికి మరో అవకాశం కల్పిస్తారు.
How to Check Thalliki Vandanam NPCI Link..?
NPCI లింక్ ఎలా చూసుకోవాలి అని చాలామందికి సందేహాలు ఉంటాయి దీనికోసం మీ బ్యాంకు శాఖ కు వెళ్లి అడిగితే వారు తెలియజేస్తారు ఇంకో విధంగా తెలుసుకోవాలంటే మీకు ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం పథకం డబ్బులు జమ అయ్యి ఉంటే మీ బ్యాంకు కు ఆధార్ లింక్ అయినట్టే అలాగే ఆన్లైన్ ద్వారా కూడా చూసుకునే అవకాశం ఉంది క్రింద లింక్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు.
How Much Amount Thalliki Vandanam..?
ప్రభుత్వం మొత్తం 15000 విడుదల చేస్తుంది కానీ ఇందులో తల్లికి 13000 జమ చేస్తారు మిగిలిన వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణ కొరకు మరియు ఇంకో వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ కొరకు వినియోగిస్తారు.
Thalliki Vandanam Release Date..?
తల్లికి వందనం పథకం ఈరోజు అనగా 12 జూన్ 2025 ఉదయం 11 గంటలకు ఈ పథకం ప్రభుత్వం అధికారికంగా ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి మొదలై రెండు రోజుల్లో అందరూ తల్లులకు డబ్బులు వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు ఎవరు ఆందోళన చెందకుండా వేచి ఉంటే మీ డబ్బులు మీ బ్యాంకు ఖాతాకు విడుదల కావడం జరుగుతుంది.
ఇటువంటి Thalliki Vandanam పథకం సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “Thalliki Vandanam: తల్లికి వందనం పథకం డబ్బులు ఈరోజు విడుదల, ఈ లిస్ట్ చూసుకోండి ”