Thalliki Vandanam Update: ప్రారంభమైన డబ్బుల జమ, కొంత మందికి జూలై 5, పేరు లేకుంటే ఇలా చేయండి

Thalliki Vandanam Latest Update:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 12 జూన్ నిన్న “తల్లికి వందనం” పథకం ప్రారంభించారు దీనికి సంబంధించిన నగదు జమ ప్రారంభం అవడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మందికి మొదటి విడతలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది రాత్రికి కొంతమందికి నగదు జమ కావడం జరిగింది శుక్రవారం సాయంత్రం లోపు లబ్ధిదారులు అందరికీ నగదు జమ చేస్తారు. అర్హులు మరియు అనర్హుల జాబితా గ్రామ, వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచారు ఎవరికైనా సందేహాలు ఉంటే మీ సచివాలయంలో లిస్ట్ పరిశీలించవచ్చు. కొంతమందికి నగదు జూలై 5 వ తేదీ విడుదల చేయనున్నారు ఎందుకు అనగా వారికి కొన్ని సాంకేతిక కారణాలవల్ల ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయలేక పోవడం వలన అటువంటి వారి కోసం కొత్త షెడ్యూల్ ను విడుదల చేశారు పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Thalliki Vandanam పథకం సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

Thalliki Vandanam New Schedule:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన Thalliki Vandanam పథకం ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఆ షెడ్యూల్ వివరాలు చూసుకుంటే.

  • 54 లక్షల మంది విద్యార్థులకు నగదు జమ జూన్ 12 వ తేదీ నుండి ప్రారంభం అవడం జరిగింది.
  • అర్హులు అనర్హుల జాబితా జూన్ 12 వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శించారు.
  • సచివాలయాలు ద్వారా అభ్యంతరాలు, వినతులు జూన్ 12 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు స్వీకరిస్తారు.
  • సప్లిమెంటరీ అర్హుల జాబితా జూన్ 21 నుండి 28 వరకు తయారు చేస్తారు.
  • ఒకటవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల జాబితా జూన్ 30 వ తేదీ ప్రదర్శిస్తారు.
  • మొదటి జాబితాలో డబ్బులు జమ కాని వారికి జూలై 5 వ తేదీ అర్హులైన అందరికీ డబ్బులు జమ చేస్తారు.

Thalliki Vandanam అనర్హులు వివరాలు:

తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హులు ఎందుకు అయ్యారో తెలుసుకోవాలంటే మీ జాబితా వివరాలు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంటుంది క్రింద తెలిపిన కారణంగా అన్నంలో అయ్యి ఉంటారు.

  1. కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో 10000, పట్టణాల్లో 12,000 మించకూడదు.
  2. కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా రైస్ కార్డు కలిగి ఉండాలి.
  3. మూడు ఎకరాలకు మించి మాగాని, పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు.
  4. నాలుగు చక్రాల సొంత వాహనం ఉండరాదు.
  5. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటకూడదు.
  6. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు.
  7. ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు.
  8. రాష్ట్ర హౌస్ హోల్డ్ డేటా బేస్ లో తల్లి మరియు విద్యార్థి నమోదు అయ్యి ఉండాలి ఒకవేళ నమోదు అవ్వకుంటే పరిశీలించి ఎంపిక చేస్తారు.
  9. విద్యార్థి కచ్చితంగా 75% హాజరు ఉండాలి ఈ సంవత్సరం 75% ఉంటేనే వచ్చే సంవత్సరం తల్లికి వందనం లభిస్తుంది.

Thalliki Vandanam Latest Update

Thalliki Vandanam Status Check:

మీరు అనర్హులు అయ్యారు లేదో ఆన్లైన్ ద్వారా మీ స్టేటస్ చెక్ చేయడానికి అవకాశం లేదు కేవలం గ్రామ మరియు మీ వార్డు సచివాలయం లో జాబితా విడుదల చేయడం జరిగింది ఆ జాబితాలో మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అనర్హుల జాబితాలో ఉన్నారా పరిశీలించుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో ఉంటే మీకు ఈరోజు సాయంత్రం లోపు లేదా ఒక నాలుగు రోజుల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది అనర్హుల జాబితాలో ఉంటే సచివాలయంలో అర్జీ సమర్పించవచ్చు వారు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

Join WhatsApp Group 

ఇటువంటి Thalliki Vandanam పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “Thalliki Vandanam Update: ప్రారంభమైన డబ్బుల జమ, కొంత మందికి జూలై 5, పేరు లేకుంటే ఇలా చేయండి”

Leave a Comment

error: Content is protected !!