TTD Food Safety Officer Jobs 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి ఫీజు మరియు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి 47,400/- జీతం చెల్లిస్తారు కేవలం హిందువులు మాత్రమే దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైనున్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో నిరుద్యోగ భృతి బంపర్ న్యూస్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 10 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేశారు ఇందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం మీకు లభిస్తే తిరుమల లోని అన్న ప్రసాదం కౌంటర్ మరియు తిరుమలలో ఉన్న దుకాణాలు హోటల్స్ తనిఖీ చేయాలి.
జీతం & విద్యా అర్హత:
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే 47,400 జీతం చెల్లిస్తారు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. దరఖాస్తు చేయడానికి విద్య అర్హత బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ లేదా ఇతర సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥సచివాలయం అసిస్టెంట్ భారీగా జాబ్స్
దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఫారం క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి క్రింద తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ ఫారం 10 జూలై 2025 లోపు సమర్పించండి. 26 జిల్లాల వారు దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు చిరునామా: The assistant executive officer, centralised outsourcing cell, TTD administrative buildings, KT Road, Tirupati, AP
అఫిషియల్ వెబ్సైట్ కొరకు మీరు https://www.tirumala.org/ సందర్శించండి అక్కడ మీకు మరిన్ని వివరాలు లభిస్తాయి.
ఇటువంటి TTD ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
TTD food safety officer