ఆంధ్రప్రదేశ్ లో భారీ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి AP Mega DSC పై మొదటి సంతకం రేపు నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేయబోతున్నారు.
మీకు ఇటువంటి సమాచారం వెంటనే కావాలంటే వెంటనే మా టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.Join Telegram Group
AP Mega DSC Update:
AP Mega DSC లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో నిరుద్యోగుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. ఏ ప్రకటన వస్తుందో అని ఎదురుచూస్తున్నారు ముందుగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రకటించినట్టు మెగా dsc విడుదల కాబోతునట్టు సమాచారం వచ్చింది. AP Mega DSC 13 వేల నుండి 15 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంటుంది అని సమాచారం.
ఏపీ లో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 39 వేలు టీచర్ ఖాళీలు ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని బట్టి 15 వేల వరకు ఖాళీలు భర్తీ చేస్తారని సమాచారం వీటి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.గత ప్రభుత్వం విడుదల చేసిన 6100 పోస్టుల DSC నోటిఫికేషన్ రద్దు చేస్తారని సమాచారం అందుతోంది.
AP Group 2 Update:
AP గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు కూడా 2 నెలలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది చాలా మంది నిరుద్యోగులు వాయిదా వెయ్యాలని అడుగుతున్న తరుణంలో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం దీని పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
I want to do job