AP ECHS Recruitment 2025:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ECHS సెల్ వారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలు భర్తీ చేస్తారు. ఉద్యోగం వస్తే మూడు జిల్లాల్లో పనిచేయవలసి ఉంటుంది పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి ECHS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు చాలా తక్కువ సమయం ఉండడం జరిగింది. 31 జనవరి 2025 లోపు మీ దరఖాస్తు ఫారం సమర్పించాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరి హెల్త్ స్కీం (ECHS) సెల్ వారు విడుదల చేశారు. ఇందులో మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సఫాయివాలా, డ్రైవర్, ప్యూన్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం 43 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 8, 10, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, BDS, GNM, DMLT, బీఎస్సీ నర్సింగ్ విద్యా అర్హత ఉండాలి కొన్ని పోస్టులకు పని అనుభవం కూడా అడుగుతున్నారు.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే మీరు అర్హత సాధిస్తారు.
జీతం వివరాలు:
పోస్టుల వారీగా ఈ ఉద్యోగం మీకు లభిస్తే 16,800/- నుండి 75,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
🔥AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టులు
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
కావాల్సిన పత్రాలు:
- అప్లికేషన్ ఫారం
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
- అనుభవం సర్టిఫికెట్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
- కుల దృవీకరణ పత్రం

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి క్రింద తెలిపిన చిరునామాకు అప్లికేషన్ సమర్పించండి.
దరఖాస్తు చిరునామా: OIC, ECHS Cell, Nausena Bagh, Visakhapatnam, AP, pincode – 530005
ఇటువంటి ECHS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP ECHS లో ఉద్యోగాలు భర్తీ | AP ECHS Recruitment 2025 | Latest Jobs in Telugu”