AP Panchayath Raj Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ శాఖలో 1488 పోస్టులు భర్తీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తదుపరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వద్ద ఆమోదానికి ఫైల్ సిద్ధంగా ఉంది అసలు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎప్పుడు భర్తీ చేస్తారు అని పూర్తి సమాచారం చూసుకుంటే.
ఇటువంటి AP Panchayath Raj శాఖ ఉద్యోగాలు రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సొంత రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలో జాబ్స్
కరోనా తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఇవ్వనుంది. మొత్తం కారుణ్య నియామకాల కోసం గత ప్రభుత్వంలో 2744 మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో 1488 మందికి ఉద్యోగాలు కల్పించలేదు తమ పరిస్థితి అధ్వానంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మొర పెట్టుకోవడంతో ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీయడం జరిగింది వెంటనే నియామకాలకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
🔥ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు
కారుణ్య నియామకాల ఫైల్ పంచాయతీరాజ్ అధికారులు ఆర్థిక శాఖకు పంపారు దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఫైల్ సీఎం వద్దకు వెళ్లడం జరిగింది. ఆయన ఆమోదిస్తే 1488 మందికి పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట లభిస్తుంది. వీరిని గ్రామ సచివాలయం లో వారి అర్హతను ఆధారంగా తీసుకొని ఉద్యోగాలు కల్పిస్తారు. గత ప్రభుత్వంలో కూడా పంచాయతీ సెక్రెటరీ, VRO, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ANM, సర్వేయర్ ఇలాంటి పోస్టులు ఈవిధంగా భర్తీ చేశారు.
కొత్త నియామకాలు ఎప్పుడు..?
కారుణ్య నియామకాలు భర్తీ చేస్తున్నారు మంచి విషయమే కొత్త నియామకాలు మరియు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎప్పుడు అని నిరుద్యోగుల నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆరు నెలలు పూర్తి కావడం జరిగింది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అని చెప్పిన విడుదల కాలేదు ప్రభుత్వం కొత్త నియామకాలు కూడా చేపట్టాలని నిరుద్యోగుల నుండి భారీగా వినతులు అందుతున్నాయి. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అప్పటివరకు నిరుద్యోగులు వేచి చూడకుండా నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ వినతులు ఇవ్వండి.
ఈ రోజు వచ్చిన కారుణ్య నియామకాల సమాచారం పూర్తి వివరాల PDF క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోండి.
ఇటువంటి AP Panchayath Raj శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టులు | AP Panchayath Raj Department Jobs 2025 | AP Grama Sachivalayam Jobs 2025”