AP Forest: అటవీ శాఖలో భారీగా ఖాళీలు 3600 భర్తీ ఎప్పుడు, నిరుద్యోగులు ఎదురుచూపులు

AP Forest Department Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ లోని అటవీ శాఖలో ఖాళీలు భారీ స్థాయిలో ఉన్నాయి వాటి భర్తీ ఎప్పుడు అంటూ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కూటమీ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో నిరుద్యోగుల కోసం కేవలం డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తాము అని చెప్పిన మాటలు ఏమయ్యా నిరుద్యోగులు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి 2600 ఖాళీల లిస్ట్ అటవీ శాఖ గారు పంపించడం జరిగింది ప్రస్తుతం రిటైర్ అయిన ఉద్యోగులు అలాగే ఖాళీలు ఒక వెయ్యి వరకు పెరిగి 3600 పైగా ఉన్నట్లు సమాచారం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి AP Forest ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో కొనడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥ఏపీ లో వీరికి రేషన్ కార్డులు రద్దు

AP Forest Department Notification 2025:

ఈ 3600 ఖాళీలు ఎప్పుడూ భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి చిత్తూర్, కడప, కర్నూల్, విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఏనుగులు బెడద ఎక్కువగా ఉంది వీటిని అరికట్టడానికి అటవీశాఖ సిబ్బంది అవసరం చాలా ఉంటుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం నుండి 4 కుంకీ ఏనుగులు తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే వాటి అవసరాల కోసం చాలామంది సిబ్బంది అవసరం కూడా ఉంది అలాగే ఇతర అవసరాలకు కూడా సిబ్బంది కొరత కనిపిస్తోంది.

ఇందులో ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయవలసిన అవసరం ఉంది అలాగే టెక్నికల్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి త్వరగా తీసుకొని భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తయిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలకు ఎటువంటి ఆటంకాలు లేవు అయినా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియడం లేదు వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి.

AP Forest Department Jobs 2025

Join WhatsApp Group 

ఇటువంటి AP Forest ఉద్యోగ సమాచారం రోజు కొనడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP Forest: అటవీ శాఖలో భారీగా ఖాళీలు 3600 భర్తీ ఎప్పుడు, నిరుద్యోగులు ఎదురుచూపులు”

Leave a Comment

error: Content is protected !!