Central University Jobs 2025:
నిరుద్యోగులకు శుభవార్త సెంట్రల్ యూనివర్సిటీ (Central University of Punjab) నుండి నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, లాబరేటరీ అటెండర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలను రెగ్యులర్ పద్ధతిలో తీసుకుంటున్నారు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే పూర్తి వివరాలు పరిశీలించి ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నాన్ టీచింగ్ ఖాళీలకు దరఖాస్తు చేయండి.
ఇటువంటి Central University ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
🔥ఏపీ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి పది నవంబర్ 2025 నుండి 9 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://cupnt.samarth.edu.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Central University of Punjab (CUP) వారు విడుదల చేశారు ఇందులో నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయినా ప్రైవేట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, లాబరేటరీ అటెండర్ సంబంధించి ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే పోస్టులు అనుసరించి 10th, 12th, ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
జీతం వివరాలు:
పోస్టులు అనుసరించి క్రింద తెలిపిన విధంగా జీతం లభిస్తుంది.
- ప్రైవేట్ సెక్రటరీ 44,900/-
- సెక్షన్ ఆఫీసర్ 44,900/-
- పర్సనల్ అసిస్టెంట్ 35,400/-
- టెక్నికల్ అసిస్టెంట్ 29,200/-
- లోయర్ డివిజన్ క్లర్క్ 19,900/-
- కుక్ 19,900/-
- లాబరేటరీ అటెండర్ 18,000/-
వయస్సు:
పోస్టులు అనుసరించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 600 రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారు ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే 9 డిసెంబర్ 2025 లోపు వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Central University ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Central University లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUP Recruitment 2025 | Non Teaching Jobs”