ANGRAU Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య N G రంగా వ్యవసాయ యూనివర్సిటీ (ANGRAU) లో SRF మరియు యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు సంబంధిత డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి ఫీజు మరియు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు అప్లై చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి ANGRAU ఉద్యోగ నోటిఫికేషన్ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥CSIR లో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి చివరి తేదీ లేదు కేవలం అభ్యర్థులు 28 నవంబర్ 2025 ఉదయం 10 గంటలకు నేరుగా ఇంటర్వ్యూ హాజరు అయితే చాలు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఆచార్య N G రంగా వ్యవసాయ యూనివర్సిటీ వారు విడుదల చేశారు ఇందులో SRF మరియు యంగ్ ప్రొఫెషనల్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం అర్హత ఉన్నవారు తప్పకుండా ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
విద్యా అర్హత:
సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు సంబంధించి MSC ఎంటోమాలోజీ కోర్సు పూర్తి చేసి ఉండాలి యంగ్ ప్రొఫెషనల్ ఖాళీలకు బ్యాచిలర్ డిగ్రీ నాలుగు సంవత్సరాలు వ్యవసాయ విభాగంలో 55% మార్కులతో పూర్తిచేసి ఉన్నవారు అర్హులు.
వయస్సు:
పోస్టులు అనుసరించి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హులు రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు కూడా ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే SRF ఉద్యోగాలకు 37,000/- జీతం చెల్లిస్తారు. యంగ్ ప్రొఫెషనల్ ఖాళీలకు ఎంపికైతే 30,000 జీతం ఉంటుంది ఇతర అన్ని రకాల అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉండడం జరుగుతుంది.
🔥10th అర్హత తో గ్రూప్ c ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఎటువంటి పరీక్ష మరియు ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు కేవలం 28 నవంబర్ 2025 ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.
ఇంటర్వ్యూ వేదిక:
అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆఫీస్, RARS, నంద్యాల

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు దరఖాస్తు కూడా చేయవలసిన అవసరం లేదు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించండి.
ఇటువంటి ANGRAU ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “ANGRAU Jobs 2025: ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ యూనివర్సిటీ ANGRAU లో ఉద్యోగాలు”