CSIR CLRI Jobs 2026:
CSIR కు సంబంధించిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) లో జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సచివాలయం అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు కేవలం 10, 12 అర్హత అంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యోగం లభిస్తే 35,973/- వరకు జీతం రావడం జరుగుతుంది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి CSIR CLRI ఉద్యోగ సమాచారం ఈరోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥RBI లో 10 అర్హత బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 17 జనవరి 2026 నుండి 22 ఫిబ్రవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా CSIR కు సంబంధించిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) వారు విడుదల చేశారు ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సచివాలయం అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 13 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కేవలం 10, 12, ITI అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మొదటి నెల నుండి జీతం అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కాకుండా పోస్టులు అనుసరించి బేసిక్ పే 25,500/- నుండి 81,100/- వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://clri.org/ సందర్శించాలి పూర్తి నోటిఫికేషన్ వివరాలు అక్కడ ఇవ్వడం జరిగింది దరఖాస్తు చేయడానికి 19 ఫిబ్రవరి 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి CSIR CLRI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
