Postal GDS Jobs 2026:
నిరుద్యోగులకు భారీ శుభవార్త రావడం జరిగింది. పోస్టల్ శాఖ వారు 28,740 ఖాళీల Postal GDS ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం మొదటి నెల నుండి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి 12,000/- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి 10,000/- రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి తెలుగు తెలిసి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి Postal GDS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైనే ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥లైబ్రరీ అటెండర్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి 31 జనవరి 2026 నుండి 14 ఫిబ్రవరి 2026 వరకు ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ https://indiapost.gov.in/ లో పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా తపాలా శాఖ వారు విడుదల చేశారు ఇందులో గ్రామీణ డాక్ సేవక్ లో భాగంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 28,740 పోస్టులు ఉన్నాయి సొంత గ్రామంలో పనిచేసే మంచి అవకాశం.
విద్యా అర్హత:
కేవలం పదవ తరగతి పాస్ సర్టిఫికెట్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి తెలుగు మాట్లాడడం చదవడం తప్పనిసరిగా తెలిసే ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
ఈ పోస్టల్ GDS ఉద్యోగానికి మీరు ఎంపికైతే జీతం బేసిక్ పే 12,000/- నుండి 29,380/- వరకు ఉంటుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ వస్తాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి వంద రూపాయలు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు అయినా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
పదవ తరగతి మార్కులు ఆధారంగా మెరిట్ అభ్యర్థులకు డాక్యుమెంట్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు ఎటువంటి పరీక్ష ఉండదు మరియు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఇందులో ఉండదు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే లింక్ కింద ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి పూర్తి వివరాలు పరిశీలించి కావలసిన సర్టిఫికెట్స్ అన్ని ఆన్లైన్ లో అప్డేట్ చేసి 14 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి Postal GDS ఉద్యోగ సమాచారం ఆరోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
