RBI Recruitment 2026:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో 650 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు 16 ఫిబ్రవరి 2026 నుండి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దరఖాస్తు చేయుటకు 8 మార్చ్ 2026 చివరి తేదీ తెలుగు భాష వచ్చిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేయండి ఇందులో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం గా ఉండడం జరిగింది స్థానిక కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
ఇటువంటి RBI ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆధార్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 16 ఫిబ్రవరి నుండి 8 మార్చ్ 2026 వరకు అవకాశం కల్పించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఏప్రిల్ 11 నిర్వహిస్తారు మెయిన్స్ పరీక్ష 7 జూన్ 2026 ఉంటుంది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ RBI విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా 650 ఖాళీలు ఉన్నాయి ఇందులో హైదరాబాద్ నందు 11, బెంగళూరు 24, ముంబై 249, న్యూఢిల్లీ 49 ఈ విధంగా ఖాళీలు ఉండడం జరిగింది మీకు హిందీ భాష తెలిసే ఉంటే అధిక పోస్టులు ఉన్న రాష్ట్రాలకు కూడా దరఖాస్తు చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు తప్పనిసరిగా తెలుగు తెలిసి ఉంటేనే దరఖాస్తు చేయడానికి అర్హులు.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 20 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ వంద మార్కులకు ఉంటుంది ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించి అవసరమైతే ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే అన్నీ రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి మీకు జీతం 58,514/- వరకు రావడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు 8 మార్చ్ చివరి తేదీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇచ్చాము అర్హత పరిశీలించి ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్స్ సమర్పించండి.
ఇటువంటి RBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
