10+2 అర్హత LDC ఉద్యోగాలు భర్తీ | Indian Air Force Jobs 2026 

Indian Force LDC Jobs 2026:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) & గ్రూప్ ‘C’ సివిలియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భర్తీ చేసే పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) మొత్తం ఖాళీలు 47 ఉన్నాయి. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ (పోస్ట్ ద్వారా సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు పంపాలి) ఉద్యోగం వస్తే భారతదేశంలోని వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి అందులో పని చేయాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి LDC ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥గ్రామీణ బ్యాంకులో 10 వేల జాబ్స్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 1 ఆగస్ట్ 2026 నుండి 30 ఆగస్ట్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

విద్యా అర్హతలు & సాంకేతిక నైపుణ్యాలు:

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC): గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి / ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.

టైపింగ్ స్పీడ్: కంప్యూటర్ పై ఇంగ్లీష్ లో నిమిషానికి కనీసం 35 పదాలు (wpm) లేదా హిందీలో 30 పదాలు (wpm) టైప్ చేయగలగాలి.

హిందీ టైపిస్ట్: 12వ తరగతి / ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.

టైపింగ్ స్పీడ్: కంప్యూటర్ పై హిందీలో నిమిషానికి కనీసం 30 పదాలు (wpm).

సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్: 10వ తరగతి / మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.

లైసెన్స్ & అనుభవం: LMV/HMV (లైట్ & హెవీ వెహికల్) చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, కనీసం 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం మరియు వాహన మెకానిజం లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:

వయోపరిమితి:18 నుండి 25 సంవత్సరాలు.

వయోపరిమితి:

OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు

SC / ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు

దివ్యాంగులు (PwBD) / ఎక్స్-సర్వీస్‌మెన్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలు

 జీతం (Pay Scale):

ఎంపికైన అభ్యర్థులకు 7వ పే ప్రకారం లెవల్-2 జీతం లభిస్తుంది. వేతన స్కేల్: ₹19,900 – ₹63,200 (దీనితో పాటు DA, HRA, TA తదితర కేంద్ర ప్రభుత్వ భత్యాలు ఉంటాయి).

దరఖాస్తు రుసుము:

ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

1.రాత పరీక్ష (Written Exam):జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ పైన ఆబ్జెక్టివ్ పరీక్ష.

2.స్కిల్ / టైపింగ్ / డ్రైవింగ్ టెస్ట్: రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి నైపుణ్య పరీక్ష ఉంటుంది.

3.సర్టిఫికేట్ పరిశీలన & మెడికల్ టెస్ట్:

దరఖాస్తు విధానం: 

1.అధికారిక నోటిఫికేషన్ లేదా ఎంప్లాయిమెంట్ న్యూస్ నుండి నిర్దేశిత Application Form ప్రింట్ తీసుకోవాలి.

2. ఫారం ను ఇంగ్లీష్ లేదా హిందీలో స్పష్టంగా నింపాలి.

3. క్రింది ధృవీకరణ పత్రాల Self-Attested (స్వయంగా సంతకం చేసిన) ప్రతులను జత చేయాలి

4.10వ తరగతి & ఇంటర్మీడియట్ మార్కుల జాబితా / సర్టిఫికేట్లు

5.పుట్టిన తేదీ ఆధార పత్రం (DOB Proof)

6.కుల ధృవీకరణ పత్రం (Caste Certificate – అవసరమైన వారికి)

7.డ్రైవింగ్ లైసెన్స్ & అనుభవ పత్రం (డ్రైవర్ పోస్టుకి అప్లై చేసే వారికి)

8. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

9.కవర్ (Envelope) పైన స్పష్టంగా ఇలా రాయాలి: “APPLICATION FOR THE POST OF [పోస్ట్ పేరు] AND CATEGORY [మీ కేటగిరీ]”.

10. ఈ ఫారం ను సాధారణ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సంబంధిత Air Force Station / Unit Commander చిరునామాకు పంపాలి.

Indian Force LDC Jobs 2026

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు ఫారం కింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Notification & Application PDF

Official Website

ఇటువంటి LDC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!