Railway JE Recruitment 2026:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 3993 జూనియర్ ఇంజనీర్ (JE) మరియు డిపో మెటీరియల్ సూపరిండెంట్ ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయడానికి 13 సెప్టెంబర్ 2026 చివరి తేదీ చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ రైల్వే శాఖ నుండి రావడం జరిగింది నోటిఫికేషన్స్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB JE ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥DRDO బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 14 ఆగస్టు 2026 నుండి 13 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) వారు విడుదల చేశారు ఇందులో జూనియర్ ఇంజనీర్ మరియు మెటీరియల్ సూపరిండెంట్ ఖాళీలు మొత్తం 3993 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో బీటెక్ , డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేదు అర్హత ఉంటే చాలు నేరుగా ఉద్యోగానికి దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు రిజర్వేషన్ ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం అన్ని రకాల అలవెన్స్లు మరియు బెనిఫిట్స్ కలిపి 48,000/- వరకు రావడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి బేసిక్ పే 35,000/- నుండి 1,12,400/- వరకు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు మరియు EX – Army వారు 250 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు మిగిలిన అందరూ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు 13 సెప్టెంబర్ 2026 లోపు ఆన్లైన్ ద్వారా మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి RRB JE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
