Aadabidda Nidhi Scheme:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే 4 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి స్కీమ్ కూడా అమలు చేయనుంది అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అయితే ఆడబిడ్డ నిధి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటువంటి Aadabidda Nidhi పథకాల లాంటి సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
Aadabidda Nidhi Scheme Update:
- ఈ పథకం అమలు చేస్తే ప్రతి నెల పదవ తేదీలోపు మహిళల అకౌంట్లో 1500 జమ చేయడం జరుగుతుంది
- లబ్ధిదారుల జాబితా గ్రామ మరియు వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచుతారు.
- ఈ పథకానికి అర్హులు అవ్వడానికి అన్ని సర్టిఫికెట్లు ఉంటేనే వారికి మాత్రమే అమలు చేస్తారు.
- ఆడబిడ్డ నిధి పథకాన్ని P4 ద్వారా అనుసంధానం చేసి మహిళలకు ఆర్థిక చేయూత అందించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
- ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తారు.
- మొదటగా ఈ పథకం P4 లో ఉండే పేదవారికి అమలు చేసే అవకాశం ఉంది
Aadabidda Nidhi Eligibility:
ఆంధ్రప్రదేశ్ లోని ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేయాలంటే క్రింది తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
- దరఖాస్తు చేసే మహిళ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసితురాలై ఉండాలి.
- తప్పనిసరిగా 18 నుండి 59 సంవత్సరాల వయస్సు లోపు కలిగి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం ప్రతినెల గ్రామీణ ప్రాంతాల్లో 10000 పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగం లేదా ఇన్కమ్ టాక్స్ చెల్లించే కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు.
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు.
- పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కన్నా తక్కువ వైశాల్యంతో ఇల్లు కలిగి ఉండాలి.
Aadabidda Nidhi Documents:
దరఖాస్తు చేయడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు చూసుకుంటే.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- బ్యాంకు ఖాతా
- కుల ధ్రువీకరణ పత్రం
- వయస్సు ధ్రువీకరణ పత్రం
దరఖాస్తు చేసే విధానం:
ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతం మార్గదర్శకాలు మాత్రమే విడుదల చేయడం జరిగింది త్వరలో గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది అప్పటివరకు పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి. త్వరలో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు విధానం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ లో 3300 కోట్లు ఈ పథకం కోసం కేటాయించడం జరిగింది.
ఇటువంటి ఆడబిడ్డ నిధి పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.