Annadata Sukhibhava Update:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు ఆర్థిక సహాయం కోసం Annadata Sukhibhava పథకాన్ని ప్రభుత్వం జూన్ 20 న విడుదల చేస్తున్నారు మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం 2000 రాష్ట్ర ప్రభుత్వం 5000 మొత్తం 7000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇలా మూడు 20 వేల రూపాయలు రైతులకు లబ్ధి లభిస్తుంది. ఈ పథకానికి సంబంధించి అర్హులైన వారు ekyc చేసుకోవాలి. వీటికి సంబంధించి ekyc ఎలా చేయాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, లబ్ధిదారుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకానికి ఎవరు అర్హులు:
- ఆంధ్రప్రదేశ్ లో రైతులు మాత్రమే అర్హులు.
- భూ పట్టాదారు రైతులు మరియు కౌలు రైతులు ఇద్దరు కూడా అర్హులే.
- తప్పనిసరిగా పీఎం కిసాన్ లబ్ధిదారులై ఉండాలి.
- ekyc పూర్తి చేసుకోవాలి.
- లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం అయ్యి ఉండాలి.
ekyc ఎలా చేసుకోవాలి..?
ekyc చేసుకోవడానికి ఆన్లైన్ లో అవకాశం ఉంది ఎవరైనా తెలియకపోతే మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రం వెళ్లారంటే అక్కడ మీకు ekyc పూర్తి చేస్తారు ఈ విధంగా మీరు దీనిని చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా https://pmkisan.gov.in/ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు.
లబ్ధిదారుల జాబితా ఎలా చూసుకోవాలి:
మీరు అర్హుల అనర్హుల చూసుకోవడానికి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి అవి ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
- ముందుగా మీరు https://pmkisan.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో beneficiary status అనే ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చే మొబైల్ నెంబరు OTP తో మీరు అర్హులా కాదా చూసుకునే అవకాశం ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ద్వారా కూడా మీ వివరాలు తెలుసుకోవచ్చు ముందుగా మీరు https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో Know Your Status ఆప్షన్ ద్వారా మీరు లబ్ధిదారుల కాదా తెలుసుకోవచ్చు.
పైన తెలిపిన విధంగా అర్హులు అయినవారికి ₹7,000 జూన్ 20 వ తేదీ ప్రభుత్వం విడుదల చేస్తుంది మీకు ఆన్లైన్ ద్వారా చూసుకోవడం రాకపోతే రైతు సేవా కేంద్రం వెళ్లి మీరు Annadata Sukhibhava లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో పరిశీలించుకోవచ్చు.
ఇటువంటి అన్నదాత సుఖీభవ పథకాల సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితా, విడుదల చేసే తేదీ ”