AP DSC 2025 Update:
ఆంధ్రప్రదేశ్ లో DSC దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది గురువారం రాత్రి 8 గంటల వరకు 5,67,067 దరఖాస్తులు వచ్చాయి మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు డిఎస్సీ పోస్టులకు దరఖాస్తు చేయడం జరిగింది ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఈ సంఖ్య జరిగింది చివరి రోజు రాత్రి 8 గంటల వరకు 12,173 దరఖాస్తులు రాగా అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సంఖ్య కాస్త పెరిగి ఉంటుంది.
ఇటువంటి DSC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ఏపీ డీఎస్సీ పోటీ ఎలా ఉంది..?
జిల్లాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయా తెలియాల్సి ఉంది జిల్లాల వారీగా పోటీ మారే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో 16,347 డీఎస్సీ ఉద్యోగాలు విడుదల చేశారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోటీ చూసుకుంటే ఒక పోస్ట్ కు 35 మంది వరకు పోటీ ఉన్నారు ఈ పోటీ అనేది జిల్లాల వారీగా పోస్టుల వారీగా దరఖాస్తు చేసిన వారి సంఖ్య ఆధారంగా మారుతుంది.
ఏపీ డీఎస్సీ 45 రోజుల గడువు ఇస్తారా..?
నిన్న అనగా 15 మే 2025 న నారా లోకేష్ గారు ఈ నోటిఫికేషన్ పైన మాట్లాడటం జరిగింది. మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ఒక సంవత్సరం ముందు సంతకం చేసాము 7 నెలల ముందు సిలబస్ విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించి జూలై ఆఖరి నాటికి నియామకాలు పూర్తి చేస్తామని వెల్లడించారు దీనికి అనుగుణంగా ఈ పరీక్షల గడువు ఎట్టి పరిస్థితుల్లో పెంచే అవకాశం లేదు.
అభ్యర్థులు ఇప్పటికైనా దీనిని గమనించి ఈ 20 రోజుల సమయాన్ని వృధా చేయకుండా ఎవరి మాటలు వినకుండా ఎక్కువ సమయం చదవడానికి కేటాయించండి కచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ప్రభుత్వం గడువు పెంచే ఆలోచనలో ఉంటే ఇప్పటికే పెంచి ఉండేది విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించిన నేపథ్యంలో అభ్యర్థులు ఇక పూర్తి సమయం చదవడానికి కేటాయించండి.
ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి..?
డీఎస్సీ అభ్యర్థులు అడుగుతున్న వాటిలో న్యాయబద్ధంగా ఉన్నది ఒకే జిల్లా ఒకే పేపర్ దీనిపై అభ్యర్థులు పోరాడి ఉండే కచ్చితంగా న్యాయం జరిగేది ఇన్ని రోజులు అందరూ గడువు పెంచాలని మాత్రమే ఎక్కువగా కోరారు. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహిస్తే అభ్యర్థులు నార్మలైజేషన్ లో నష్టపోమని అడుగుతున్నారు ప్రభుత్వం దీనిపైన ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి కానీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలంటే CBT విధానంలో నిర్వహిస్తేనే పారదర్శకంగా మరియు త్వరగా పూర్తవుతుందని అధికారులు అంటున్నారు.
ఇటువంటి AP DSC ఉద్యోగ సమాచారం రోజు పొందాలంటే మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP DSC 2025 Update: డీఎస్సీ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంచుతారా..?”