AP DSC Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లో మెగా DSC కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తారు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నారు ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన నేపథ్యంలో వర్గీకరణ కు సంబంధించిన ఆర్డినెన్స్ రాగానే కొత్త రోస్టర్ ప్రకారం ఈ పోస్టులు భర్తీ ప్రక్రియ మొదలవుతుంది.
ఇటువంటి AP DSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥APPSC గ్రూప్ 2 ఫలితాలు విడుదల
AP DSC Notification Date:
వారం రోజుల్లో ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తారు ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ ఫైలు ఒకటి రెండు రోజుల్లో రాజ్ భవన్ పంపుతారని వెంటనే ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం.
ముందుగా ప్రకటించినట్లు 16,347 DSC పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు ఇప్పటికే విద్య శాఖ మంత్రి లోకేష్ గారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జూన్ చివరి నాటికి పూర్తి చేసి పాఠశాలలు తెరిచే నాటికి ఉపాధ్యాయులు నియామక ప్రక్రియ పూర్తి చేస్తారని సమాచారం.
కావున ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఇటువంటి AP DSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP DSC Notification 2025: వారంలో మెగా DSC నోటిఫికేషన్ వచ్చేస్తుంది”