AP DSC పరీక్షలు వాయిదా పడనున్నాయ..?
దీనికి సమాధానం అవునని తెలుస్తోంది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల అవ్వాల్సి ఉన్న ఎన్నికల కోడ్ వచ్చిన కారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి తర్వాతే టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలపడం జరిగింది.
ఈ తరుణంలో AP DSC పరీక్ష నిర్వహించే అవకాశం ఎంతవరకు ఉంటుందని చూసుకుంటే చాలామంది ఈ పరీక్ష రాస్తున్నవారు ఇతర ఉద్యోగాలు మరియు ఎలక్షన్ విధి నిర్వహణలో ఉన్న కారణంగా ఈ పరీక్షను వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ కు వినతులు సమర్పిస్తున్నారు.
ఈ పరీక్షలు నిర్వహించాలన్న వాయిదా వేయాలన్న పూర్తి నిర్ణయం ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉంది ఒకవేళ వాయిదా పడితే తిరిగి ఈ పరీక్షలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే మే 13వ తేదీ తర్వాత నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
AP DSC వాయిదా కారణాలు..?
ఎన్నికల కారణంగా సివిల్స్ పరీక్షలు కూడా ఇప్పటికే వాయిదా వేశారు కావున AP DSC పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నది .వాయిదా పడిన పడకపోయినా అభ్యర్థులు ప్రిపరేషన్ లో ఉంటే పరీక్షలు ఎప్పుడు నిర్వహించిన బాగా రాసే అవకాశం ఉంటుంది.
AP జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఒకవేళ వాయిదా పడితే ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి ప్రిపరేషన్ కొరకు తగిన సమయం రావడం వలన బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షను బాగా రాస్తే ఈ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది.
6100 పోస్టులకు మార్చ్ 30 నుండి ఏప్రిల్ 30 వరకు పరీక్ష షెడ్యూల్ ప్రకటించారు ఈ షెడ్యూల్ అనుమతి కొరకు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది టెట్ ఫలితాలు కూడా ఇంకా విడుదల కాలేదు.రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ కమిషన్ నుండి సమాధానం వచ్చే అవకాశం ఉంది.