AP KGBV 2026 Recruitment: ఆంధ్రప్రదేశ్ కేజీబీవీ ల్లో 299 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

AP KGBV 2026 Recruitment:

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు KGBV ల్లో ఖాళీగా ఉన్న 299 పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, CRT మరియు PET పోస్టులు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయడానికి 300 రూపాయలు ఫీజు చెల్లించాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి KGBV ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

  • ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27 మే, 2026
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 05 జూన్ 2026
  • తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల తేదీ: 07 జూన్ 2026 (1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు)

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా KGBV ల్లో ఖాళీగా ఉన్న 299 పోస్టుల భర్తీ కొరకు విడుదల చేశారు ఇందులో భర్తీ చేసే పోస్టుల వివరాలు.

  • ప్రిన్సిపాల్ (Principal)
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)
  • కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRT)
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET)

మొత్తం 299 పోస్టులు (రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కేజీబీవీ ల్లోఖాళీల భర్తీ). వీటిని కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి గాను చేపడుతున్నారు.

విద్యా అర్హత:

1. ప్రిన్సిపాల్ (Principal):

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG / Master’s Degree) ఉండాలి. దీనితో పాటు తప్పనిసరిగా B.Ed డిగ్రీ కలిగి ఉండాలి.

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT):

విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో (ఉదాహరణకు: ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ మొదలైనవి) కనీసం 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలాగే గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Ed పూర్తి చేసి ఉండాలి.

3. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT):

విద్యార్హత: సంబంధిత సబ్జెక్టు లలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (Graduation / BA / BSc / BCom) లేదా NCERT రీజినల్ ఇన్స్టిట్యూట్ నుండి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత methodology B.Ed అర్హత ఉండాలి.

అదనపు అర్హత: అభ్యర్థులు AP TET / CTET (Paper-II) లో అర్హత (Qualify) సాధించి ఉండాలి.

4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET):

విద్యార్హత: ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి U.G.D.P.Ed / B.P.Ed / M.P.Ed (Physical Education లో డిప్లొమా లేదా డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 300 రూపాయల ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేయాలి ఫీజు నుండి ఎవరికీ మినహాయింపు లేదు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యా అర్హత లోసాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా మరియు రోస్టర్ పద్ధతిని అనుసరించి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే ఖాళీలను బట్టి పని చేసే అవకాశం ఉంటుంది.

జీతం వివరాలు: 

ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (AP KGBV) నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టులకు అందించే నెలవారీ గౌరవ వేతనం క్రింద తెలిపిన విధంగా ఉంటుంది:

  • ప్రిన్సిపాల్ (Principal): 34,139/-
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): 26,759/-
  • కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT): 26,759/-
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET): 26,759/-

AP KGBV 2026 Recruitment

దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి KGBV ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP KGBV 2026 Recruitment: ఆంధ్రప్రదేశ్ కేజీబీవీ ల్లో 299 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల ”

Leave a Comment

error: Content is protected !!